శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన “పాగల్ “మూవీ ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సిమ్రాన్ చౌదరి , మేఘ లేఖ , మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “పాగల్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నాడు హైదరాబాద్‌లో జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పాగల్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ తన స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. చాలామంది లవ్ చేస్తున్నాం అంటుంటారు. అందంగా ఉందా , డబ్బు ఉందా , మన కులమా కాదా అని చాలా లెక్కలు వేసుకుని ప్రేమిస్తుంటారు.. అయితే ఇవేమీ లేకుండా అన్ కండిషనల్‌గా ప్రేమించినోడే ప్రేమ్. ఆ ప్రేమ్ గాడి కథే “పాగల్”అనీ , . మనం ఎవర్ని ప్రేమించినా తిరిగి ప్రేమిస్తారు.. నువ్ అన్ కండిషనల్‌గా ప్రేమించు అని తల్లి చెప్పిన మాట తో మొదలుపెట్టిన జర్నీనే ఈ “పాగల్”అనీ , ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఈ సినిమాఅనీ , పాగల్ సినిమా కథ చెప్పినప్పుడు తనకు మైండ్ బ్లాక్ అయ్యిందనీ , మీకు ఎవరికీ తెలియదు మేం పెద్ద హిట్ కొడుతున్నామనీ , అందరూ ఫ్రైడే సినిమాని విడుదల చేస్తారు.. మేం పాగల్ కదా.. శనివారం రిలీజ్ చేస్తున్నామనీ , ఇలాంటి పరిస్థితిల్లో సినిమా రిలీజ్ చేయడం కరెక్టేనా అని చాలామంది అడుగుతున్నారనీ , తాను చెప్పేది ఒక్కటేననీ , సర్కస్‌లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడనీ , తాను అడవికి వచ్చి ఆడుకునే టైపనీ , మూసుకున్న థియేటర్లు తెరిపిస్తాననీ , అమ్మతోడు.. తన పేరు విశ్వక్ సేన్అనీ , సినిమా మామూలుగా ఉండదనీ , తన లెక్క తప్పైతే పేరు మార్చుకుంటాననీ , ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15, సినిమా థియేటర్స్‌కి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 14’ అంటూ “పాగల్” సినిమాపై విశ్వక్ సేన్ ధీమా వ్యక్తం చేశారు .
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: