ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే వెంటనే థమన్ ఎస్ అని చెప్పొచ్చు. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ అందరూ థమన్ నే సెలక్ట్ చేసుకుంటున్నారు. దానికితోడు థమన్ ఇస్తున్న ఆల్బమ్స్ కూడా అదే రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా అల వైకుంఠపురములో పాటలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవ్వడంతో థమన్ ఇంకా బిజీ అయిపోయాడు. పెద్ద సినిమాలకు అయితే మ్యాగ్జిమమ్ థమన్ నే తీసుకుంటున్నారు. దానితో పాటు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో థమన్ ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. వకీల్ సాబ్ తో ఆ కల నెరవేరింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో కు చేసే ఛాన్స్ కూడా దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విజయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాకు సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చారు. ఇక ఈసినిమాకు గాను థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక అయినట్టు తెలుస్తుంది. నిజానికి విజయ్ బీస్ట్ సినిమాకు థమన్ నే అనుకోగా అది కాస్త చేజారింది. ఇక ఇప్పుడు ఈసినిమాతో విజయ్ సినిమాకు థమన్ సంగీతం అందించే చాన్స్ కొట్టేశాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. కాగా ఇప్పటికే దిల్ రాజు నిర్మిస్తున్న శంకర్-చరణ్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: