ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం కామన్ గానే చూస్తాం. కాంబినేషన్ కలిసొస్తే ఎన్ని సినిమాలు అయినా చేయడానికి రెడీ అయిపోతుంటారు. ఇక ఇక్కడ ఒక హిట్ కాంబినేషన్ కూడా అలానే చేస్తుంది. ఆ కాంబినేషన్ అజిత్-హెచ్ వినోత్-బోనీ కపూర్. అజిత్ హీరోగా హెచ్.వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు. అదే నెర్కొండ పార్వాయి. ఈసినిమా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్. తమిళ్ లో బోనీ కపూర్ ఈసినిమాను నిర్మించాడు. ఈసినిమా తమిళ్ లో కూడా సూపర్ హిట్ అయింది. దీంతో మళ్లీ వీరికాంబినేషన్ లోనే వాలిమై సినిమాను సెట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ లో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలోనే హెచ్. వినోత్ తో అజిత్ మరో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వచ్చాయి.. ఇక రీసెంట్ గా బోనీ కపూర్ కూడా వీరిద్దరితో కలిసి వర్క్ చేయనున్నట్టు.. దానికి బోని కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఇవి కేవలం వార్తలు మాత్రమే.. లేకపోతే నిజమేనా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాలిమై’. ఇక ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: