నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వచ్చాయి కానీ అవి వార్తల్లాగే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈయన దర్శకత్వంలో ఎప్పుడో వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా ఇన్నేళ్లకు రిలీజ్ అయింది. ఇక ఈసినిమా ప్రమోషన్లో భాగంగా ఓ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న బి.గోపాల్ బాలకృష్ణ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. దీనిపై మాట్లాడుతూ.. బాలయ్య తో త్వరలోనే సినిమా తీస్తానని చెప్పేశారు. మంచి కథ కోసం వెతుకుతున్నామని.. కొన్ని కథలు విన్నానని.. అయితే ఇప్పటివరకు ఏ కథను లాక్ చేయలేదని అన్నారు. త్వరలోనే కథ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడితో సినిమాలు చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: