తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్‌తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వంశీ పైడి పల్లి రీసెంట్ సినిమా మహర్షి. ఇందులో రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి చెప్పాడు. ఇక ఈసినిమాకు గాను జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మరోవైపు విజయ్ కూడా దాదాపు ఈమధ్య అన్ని సినిమాలు మెసేజ్ ఒరియెంటెట్ సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ వచ్చే సినిమాపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి. వంశీ పైడిపల్లి విజయ్ కోసం ఏ కథ రాసుకున్నాడో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఒక వార్త తెరపైకి వచ్చింది. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ను ఈసినిమా ద్వారా ఇవ్వనున్నారట. ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాపర్ జర్నలిస్ట్ గా మారి అడవులను, న్యాచురల్ రిసోర్స్ ను ధ్వంసం చేసే వారికి వ్యతిరేకంగా పోరాడే అంటే గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఈసినిమా ఉంటుందని అంటున్నారు. మరి చూద్దాం దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాలి.
కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ త్వరలో తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: