తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి , శృతి జంటగా తెరకెక్కిన “లాభం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సలార్”మూవీ కై శృతి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. సోషల్ మీడియా లో శృతి అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొని అభిమానుల ప్రశ్నలకు తనదైన స్టైల్ లో జవాబిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా ఫాదర్ కమల్ హాసన్ నుండి నిర్భయంగా ఉండటం నేర్చుకున్నాననీ , జీవితం ఉల్లాసంగా సాగాలంటే హాస్యం ముఖ్యం అనీ తెలుసుకొన్నా ననీ , నెగటివ్ రోల్స్‌లో నటించాలని తనకూ ఉందనీ , ఏదో నెగటివ్ రోల్ చేయాలి కదా అని ఏది పడితే అది చేయకూడదనీ , అదృష్టం కంటే హార్డ్‌వర్క్‌ని, మంచి అవకాశాలను నమ్ముతాననీ, బాధని అధిగ మించడానికి దేవుడిని పూజిస్తాననీ , ఫ్రెండ్‌తో మాట్లాడతాననీ , కొన్నిసార్లు ఏడుస్తాననీ , ఆ కన్నీళ్లల్లో తన బాధ కూడా కరిగిపోతుందనీ , సంగీతంపరంగా 1970 దశాబ్దం బెస్ట్ అనుకుంటున్నాననీ , ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకుంటున్నాననీ , మొత్తం మీద జీవితం అద్భుతంగా ఉందనీ , తనకు బోలెడంత ఆనందాన్ని ఇచ్చేది ‘నిజాయతీ’ అనేది ఇన్నేళ్లల్లోతాను నేర్చుకున్న ఓ పాఠంఅనీ , ‘‘మీరు (ఫ్యాన్స్) చూపించే ప్రేమ.. ఐస్‌క్రీమ్… ‘యాంకర్ మ్యాన్’ (అమెరికన్ కామెడీ సినిమా)…తనను ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుస్తాయనీ శృతి చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: