తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు.తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ సీక్వెల్ “F3 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “F3 ” మూవీ షూటింగ్ లో తమన్నా పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని రీగల్ ప్యాలస్ లో “F 3 “మూవీ టీమ్ తో డిన్నర్ , ఒక ఖవ్వాలి పెర్ఫార్మెన్స్ ను తమన్నా ఎంజాయ్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తో సెల్ఫీ తీసుకుని తమన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: