వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆతరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే భీమ్లానాయక్ కంటే ముందే హరిహర వీరమల్లు సినిమా మొదలైంది. ఆ తరువాత రెండు సినిమాలను పార్లల్ గా చేస్తుండగానే కరోనా రావడంతో రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ తరువాత భీమ్లా నాయక్ సినిమాను ముందు రీస్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరగనుండగా త్వరలోనే షూటింగ్ ముగియనుంది. ఇక ఆ తరువాత హరిహర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా హరీష్ శంకర్ తో పవన్ రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ‘విజయదశమి’ రోజున, అంటే అక్టోబర్ 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. హరి హర వీరమల్లు చేస్తూనే ఈ సినిమా కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పై రానున్నట్లు తెలుస్తోంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: