
ట్యాగ్ · 94 కథనాలు · పేజీ 2


'సాయిపల్లవి' లేడీ పవన్ కళ్యాణ్..!

నాని-కీర్తి సురేష్ ల 'దసరా' మొదలు..!

కీర్తి సురేష్ ట్రెడిషినల్ లుక్

ఒక అందమైన చిన్న సామ్ అభిమాని

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!

"భోళా శంకర్"మూవీ అప్ డేట్

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్

"భోళా శంకర్ "మూవీ సెట్స్ కు కీర్తి సురేష్

కరోనా నుండి కోలుకున్న 'మహానటి'

కరోనా బారిన పడ్డ 'కీర్తి సురేష్'

నాని "దసరా " మూవీ కై భారీ సెట్
సూపర్ హిట్ "శ్యామ్ సింగ రాయ్"మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నాని కామెడీ ఎంటర్ టైనర్ "అంటే ..సుందరానికీ " మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. “దసరా" మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

"అరబిక్ కుతు"సాంగ్ కు కీర్తి సురేష్ డ్యాన్స్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా మారారు. “సర్కారు వారి పాట “ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా , “దసరా ” మూవీ లో న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా కీర్తి నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్నారు.మహేష్ బాబు తో ఫస్ట్ టైమ్ , బ్లాక్ బస్టర్ “నేను లోకల్ “మూవీ లో నాని కి జంటగా నటించిన కీర్తి , “దసరా “మూవీ లో రెండవసారి జంటగా నటిస్తున్నారు. “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కు హ్యాట్సాఫ్ - ఎమ్మెల్యే రోజా
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లో హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ హీరో అనిపించుకుంటున్నారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేశ్ తాజాగా "ప్యూర్ లిటిల్ హార్ట్స్'" ఫౌండేషన్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆయన ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడి వారి తల్లిదండ్రుల పాలిట దైవంగా నిలిచారు.మహేశ్ బాబుపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

'సర్కారు వారి పాట' శివరాత్రి కి స్పెషల్ పోస్టర్..!
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే కళావతి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం.. ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని దూసుకుపోతుంది.

'సాయిపల్లవి' లేడీ పవన్ కళ్యాణ్..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏది వస్తే ఆపాత్ర కాకుండా.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ తన అందం, అభినయం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు.

"గాంధారి "మ్యూజిక్ వీడియో లాంచింగ్ ఈవెంట్ లో కీర్తి సురేష్
పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ ఒక మ్యూజిక్ వీడియో లో నటించారు. ది రూట్, సోనీ మ్యూజిక్ సౌత్ నిర్మాణ సారథ్యం లో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో కీర్తి సురేష్ “గాంధారి” మ్యూజిక్ వీడియోలో నటించారు. “లవ్‌స్టోరి “మూవీ ఫేమ్ పవన్ సీహెచ్ స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, అనన్య భట్ గానం చేశారు . బృందా మాస్టర్ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు.

నాని-కీర్తి సురేష్ ల 'దసరా' మొదలు..!
రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఒక దాని తరువాత ఒకటి అనుకుంటూ పట్టాలెక్కించేస్తున్నాడు నాని. అందులో దసరా సినిమా కూడా ఒకటి. గత సంవత్సరం దసరా రోజు నాని ‘దసరా’ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే నాని లుక్ ను రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. ఈసినిమాలో నాని కొత్త మేకోవర్ లో అలానే ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో తెలంగాణ గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.

కీర్తి సురేష్ ట్రెడిషినల్ లుక్
సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు.కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి…

ఒక అందమైన చిన్న సామ్ అభిమాని
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు ,తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంతకు అభిమాన గణం అధికమే. సమంత అభిమానులలో పెద్దల తో పాటు ,చిన్నారులు కూడా ఉన్నారు. సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు ,తమిళ , హిందీ భాషల మూవీస్ లో సమంత నటిస్తున్నారు.

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' రివ్యూ
ఓవరాల్‌గా చూస్తే గుడ్ లక్ సఖి సినిమా పూర్తి భిన్న కథాంశ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ కు ఈసినిమా మరింత నచ్చుతుంది.

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్
నటీనటులు.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు దర్శకత్వం.. నగేష్ కుకునూర్ బ్యానర్స్.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాత.. సుధీర్ చంద్ర సహ నిర్మాత- శ్రావ్య వర్మ సమర్పణ.. దిల్ రాజు సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి.. చిరంతన్ దాస్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!
తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది కీర్తిసురేష్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక ఆతరువాత అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళుతుంది. ఈనేపథ్యంలోనే కీర్తి సురేష్ నుండి వస్తున్న మరో మహిళా ప్రాధాన్యమైన సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫైనల్ గా రేపు జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RRR నాటు నాటు సాంగ్ కు రామ్ చరణ్ , కీర్తి సురేష్ ల డ్యాన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 18 వ తేదీ లేదా ఏప్రిల్ 28వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

యూట్యూబ్ ట్రెండింగ్ లో "గుడ్ లక్ సఖి ", "రంగ రంగ వైభవంగా "
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి"మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి."గుడ్ లక్ సఖి " మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

"భోళా శంకర్"మూవీ అప్ డేట్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్
మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ తరువాత పలు లేడీ ఓయెంటెడ్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో గుడ్ లక్ సఖి సినిమా కూడా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఈసినిమా కూడా చాలా సార్లు రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

"భోళా శంకర్ "మూవీ సెట్స్ కు కీర్తి సురేష్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

కరోనా నుండి కోలుకున్న 'మహానటి'
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. గత రెండు వారాల్లోనే ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక దీనిలో భాగంగానే సర్కారు వారి పాట టీమ్ లో ముగ్గురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ముందు సూపర్ స్టార్ మహేష్ తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని తెలుపగా.. ఆ తర్వాత థమన్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. వారిద్దరి తర్వాత కీర్తి సురేష్ కూడా రీసెంట్ గానే తనకు కూడా కరోనా నిర్థారణ అయిందని తెలిపింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కానీ కరోనా పాజిటివ్ అని వచ్చిందని.. జాగ్రత్తగా ఉండండి..అందరూ వ్యాక్సిన్లు…

కరోనా బారిన పడ్డ 'కీర్తి సురేష్'
కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, థమన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్, ఖుష్బూ … ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనకు కరోనా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.