పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ ఒక మ్యూజిక్ వీడియో లో నటించారు. ది రూట్, సోనీ మ్యూజిక్ సౌత్ నిర్మాణ సారథ్యం లో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో కీర్తి సురేష్ “గాంధారి” మ్యూజిక్ వీడియోలో నటించారు. “లవ్‌స్టోరి “మూవీ ఫేమ్ పవన్ సీహెచ్ స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, అనన్య భట్ గానం చేశారు . బృందా మాస్టర్ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గాంధారి “మ్యూజిక్ వీడియో లాంచింగ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ .. ‘‘గాంధారి”లాంటి మ్యూజిక్ వీడియో లో నటించడం ఓ ప్రయోగంలా అనిపించిందనీ , రెండు రోజుల్లోనే ఈ పాటను పూర్తి చేశామనీ , బృందా మాస్టర్‌గారు కొరియోగ్రఫీ చేసిన పాటలు చేశాననీ , ఇప్పుడు ఆమె దర్శకత్వంలోనూ వర్క్ చేయడం సంతోషంగా ఉందనీ చెప్పారు. కీర్తి అద్భుతంగా డ్యాన్స్ చేసిందనీ , కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా ఎంజాయ్ చేస్తూ ఈ పాట చేశాననీ బృంద మాస్టర్ చెప్పారు. ఈ ఈవెంట్ లో సంగీత దర్శకుడు పవన్, రూట్ ప్రతినిధి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: