
ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 2


ఇండియన్ 2 కోసం కమల్ డెడికేషన్

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు

ఇండియన్ 2 స్పీడు పెంచనున్న కమల్


300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!

ఇళయ దళపతి తో సినిమాపై కమల్ క్లారిటీ..!

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్

"పుష్ప :ది రైజ్"మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు

'భారతీయుడు 2' లో సూపర్ విలన్.!

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్

కబాలి డైరెక్టర్ తో కమల్..!

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!

కమల్ 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

కమల్ బర్త్ డే కు రెడీ అవుతున్న 'విక్రమ్' టీజర్

కమల్ 'విక్రమ్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే

మరోసారి కమల్ హాసన్ కు జోడీగా త్రిష ?
తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారం. తాజాగా త్రిష సినిమాలతో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లోత్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

ఇండియన్ 2 కోసం కమల్ డెడికేషన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈమధ్యకాలంలోనే మళ్లీ ఈసినిమా షూటంగ్ ను మొదలుపెట్టారు. ఒకపక్క చరణ్ సినిమా కంప్లీట్ చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంది.

కాంతార మూవీపై కమల్ హాసన్ , పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇండియన్ 2 స్పీడు పెంచనున్న కమల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నఇండియన్ 2 సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే మరోపక్క రామ్ చరణ్ సినిమాను అలానే ఇండియన్ 2 సినిమాను పార్లల్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే న్యూజిలాండ్ షూట్ ను పూర్తిచేశాడు.

తమిళనాడు , సింగపూర్ , యూకె , యు ఏ ఈ , కేరళలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా "విక్రమ్ "
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా…

300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీలో ఉన్నారు. దానికి కారణం విక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ నుండి మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు పైన అయిపోయింది. అందులోనూ కమల్ మంచి హిట్ కొట్టి కూడా చాలా కాలం అయిపోయింది. అలాంటి నేపథ్యంలో విక్రమ్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వెయిట్ చేశారు. ఇక ఈసినిమా ప్రారంభించిన తరువాత మధ్యలో కరోనా వల్ల బ్రేక్ లు పడ్డాయి.. ఆ తరువాత పలు కారణాల వల్ల కూడా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈసినిమా.

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!
మొత్తానికి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చినా.. వస్తూనే సాలిడ్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈసినిమాకు కోలివుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమల్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.

ఇళయ దళపతి తో సినిమాపై కమల్ క్లారిటీ..!
ఇప్పుడు ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి. ఈమధ్య కాలంలోనే చాలా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా అందుకు సిద్దమనే అంటున్నాడు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో కమల్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వూలు…

"విక్రమ్"లో కమల్ పాడిన స్పెషల్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల ను ఆకట్టుకున్నాయి.

"పుష్ప :ది రైజ్"మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన సాంగ్స్ కు…

'భారతీయుడు 2' లో సూపర్ విలన్.!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా మధ్యలో ఆగిపోవడానికి కారణాలు ఏంటో కూడా తెలుసు. కమల్ వల్ల కొన్ని రోజులు గ్యాప్ వస్తే.. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల మరికొన్ని రోజులు..ఇక కరోనా వల్ల మొత్తానికే బ్రేక్ పడింది. ఈగ్యాప్ లో లైకాకు, శంకర్ కు మధ్య వివాదాలు రావడం.. అవి కూడా క్లియర్ అవ్వడం జరిగాయి. మొత్తానికి త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయనున్నారు.

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఖైదీ "మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "విక్రమ్ "తమిళ మూవీ 2022 మార్చి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. "విక్రమ్" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

కబాలి డైరెక్టర్ తో కమల్..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగాఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గానే కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ తో సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీని మరింత పెంచేశాడు. విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ పలువురు ప్రముఖలు నటిస్తుండగా రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి.

కమల్ 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందని ఇప్పటికే అర్థమైంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

కమల్ బర్త్ డే కు రెడీ అవుతున్న 'విక్రమ్' టీజర్
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విక్రమ్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ కు కూడా చాలా బ్రేక్ లు పడ్డాయి. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు. గత ఏడాది కమల్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఏడాది బర్త్ డేకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. రేపు నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ టీజర్ విడుదల చేయనున్నారు.

కమల్ 'విక్రమ్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విక్రమ్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. ఈసినిమా కోసం అభిమానులతో పాటు సినీలవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విక్రమ్ సినిమా నుండి ఇంట్రడక్షన్ టీజర్ విడుదలై అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. దీంతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమా షూటింగ్ కూాడా ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. అయితే కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ లు పడ్డాయి.

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఆతరువాత కమల్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ,షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.