ఇళయ దళపతి తో సినిమాపై కమల్ క్లారిటీ..!

Kamal Haasan Gives Calrity About His Film With Thalapathy Vijay,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan Movie Updates,Kamal Haasan Lates Movie Updates,Kamal Haasan Movie with Thalapathy Vijay,Kamal Haasan with Thala Vijay Movie Udpates, Kamal Haasan Give Clarity About Movie With Thalapahty Vijay,Kamal Haasan About Thalapathy,Kamal Haasan About Hero Thala Vijay,Kamal Haasan Movie with Hero Vijay,Kamal Haasan Vikram Movie Updates, Kamal Haasan Latest New About Vikram,Kamal Haasan Vikram Movie Latest News

ఇప్పుడు ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి. ఈమధ్య కాలంలోనే చాలా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా అందుకు సిద్దమనే అంటున్నాడు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో కమల్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వూలు ఇస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ ను విజయ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగగా, అందుకు విజయ్ డేట్స్ దొరికినప్పుడు అంటూ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరికీ పండగే. మరి కమల్ కు విజయ్ కు సరిపడే కథ ఎవరు రాస్తారో.. వీరిద్దిరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో తమిళ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి ఇంకా మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నారు. ఈసినిమాలో ఇంకా కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.. మరోవైపు ఈసినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కమల్ కు ఈసినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుండో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =