‘సూర్య’కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!

Kamal Haasan Gives Costly Gift to Suriya,Kamal Haasan Gifts A Costly Rolex Watch To Suriya Aka Rolex In Vikram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamla Haasan,Hero kamal Haasan,Kamal Haasan latest Movie Vikram,kamal Haasan Blockbuster Movie Vikram,Kamal Haasan Costly Gifts to Suriya, Kamal Haasan Gifts a Rolex Watch To Suriya,Rolex Watch Presented to Suriya By Kamal Haasan,Kamal Haasan Upcoming movies,Kamal Haasan Movies, Vikram Blockbuster Movies,Vikram New Movie Updates,Vikram Latest Collections Updates,Suriya In Vikram Movie,Suriya Vikram Movie Updates

మొత్తానికి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చినా.. వస్తూనే సాలిడ్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈసినిమాకు కోలివుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమల్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా చాలా గ్యాప్ తరువాత హీరోగా .. నిర్మాతగా భారీ సక్సెస్ ను కమల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో టీమ్ మెంబర్స్ కు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే తనకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. కోటి రూపాయలకి పైగా ఖరీదైన లెక్సస్ సెడాన్ కారును లోకేష్ కు ఇచ్చాడు. ఇక ఇప్పుడు సూర్యకు కూడా కమల్ నుండి కాస్ట్లీ గిఫ్ట్ అందింది. సూర్యకు రోలెక్స్ వాచ్ ను ఇచ్చారు కమల్. ఈనేపథ్యంలో కమల్ కు విక్రమ్ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా ఫొటోలను పంచుకున్నాడు. రోలెక్స్ పాత్రలో సూర్య నటించిన సంగతి తెలిసిందే కదా. సూర్య పాత్ర కూడా ఈసినిమాకు మరో హైలెట్ గా నిలిచింది.

కాగా ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈవిక్రమ్ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ విడుదల చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =