ట్యాగ్ · 195 కథనాలు · పేజీ 9
షూటింగ్ కు కాజల్ గ్రీన్ సిగ్నల్
కాజల్ కు "మోసగాళ్ళు "టీమ్ స్పెషల్ విషెస్
ఘనంగా జరిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి
మిస్ కాజల్ అగర్వాల్ గా ఇంకా రెండు రోజులే
సొంత ఇంటి పనుల్లో కాజల్ - గౌతమ్ కిచ్లూ
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కాజల్ - థాంక్యూ తమ్మీ
'మోసగాళ్ళు' తో చేయి కలిపిన వెంకీ
"మోసగాళ్ళు " మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్
గిరిజన యువతి పాత్రలో కాజల్ అగర్వాల్?

థ్రిల్లర్ టీవీ సిరీస్ లో కాజల్ అగర్వాల్
ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం - కాజల్ అగర్వాల్

తాజ్ మహల్ "చందమామ "
జన్మదిన శుభాకాంక్షలు
సాయం చేద్దాం - కాజల్ అగర్వాల్
మచ్చలేని "చందమామ "
ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో నేర్చుకున్నా..!
కాజల్ పెళ్ళి ఫొటోలలో హైలైట్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల మూవీస్ తో పాటు యంగ్ హీరోల మూవీస్ లో కూడా నటిస్తూ కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", విష్ణు మంచు "మోసగాళ్ళు ", కమల్ హాసన్ "ఇండియన్ 2 ", దుల్కర్ సల్మాన్ "హే సనామికా "(తమిళ ), "ముంబై సాగా "(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.
షూటింగ్ కు కాజల్ గ్రీన్ సిగ్నల్
తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సినామికా "(తమిళ ), "ముంబై సాగా (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "క్వీన్ " మూవీ తమిళ రీమేక్ కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన "ప్యారిస్ ప్యారిస్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
కాజల్ కు "మోసగాళ్ళు "టీమ్ స్పెషల్ విషెస్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఘనంగా జరిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి
మొత్తానికి టాలీవుడ్ లో ఒక్కొక్కరూ ఒక్కో ఇంటివారవుతున్నారు. 2020 సినిమాలకు కలిసిరాకపోయినా హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకుల పెళ్లిళ్లకు మాత్రం కలిసొచ్చింది. ఏ ఏడాది జరగనట్టుగా ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ వివాహాలు అవ్వగా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్.
మిస్ కాజల్ అగర్వాల్ గా ఇంకా రెండు రోజులే
మొత్తానికి ఇంకో రెండు రోజుల్లో మిస్ టాగ్ నుండి మిస్ట్రెస్ టాగ్ కు మారిపోనుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అభిమానులకు ఇది కొంచం బాధ కలిగించే విషయమే అయినా తన అభిమాన హీరో పెళ్లి చేసుకోడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ కిచ్లూతో అక్టోబర్ 30న అంటే మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. దీనితో ఉన్న రెండురోజుల టైం ను తన పార్టనర్ తో స్పెండ్ చేస్తుంది కాజల్. ఇక్కడ పార్ట్నర్ అంటే గౌతమ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఆ పార్ట్నర్ చెల్లెలు నిషా అగర్వాల్.
"లైవ్ టెలికాస్ట్ "వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న "మోసగాళ్ళు ", "హే సనమిక " , "ఇండియన్ 2"(తమిళ ), "ముంబై సాగ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ కు ఎంటర్ అవుతున్నారు.
సొంత ఇంటి పనుల్లో కాజల్ - గౌతమ్ కిచ్లూ
మరి కొద్దిరోజుల్లో కాజల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. అక్టోబర్ 30న పెళ్లి పెళ్ళి కి ముహూర్తం పెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా కాబట్టి పెద్ద హడావుడి లేకుండా సింపుల్ గానే కానిచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇరు కుటుంబసభ్యులతో పాటు చాలా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కాజల్ - థాంక్యూ తమ్మీ
కలువ కళ్ల సుందరి.. టాలీవుడ్ చందమామ కాజల్ కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. అక్టోబర్ 30న పెళ్లి పెళ్ళి కి ముహూర్తం పెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా కాబట్టి పెద్ద హడావుడి లేకుండా సింపుల్ గానే కానిచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇరు కుటుంబసభ్యులతో పాటు చాలా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.
'మోసగాళ్ళు' తో చేయి కలిపిన వెంకీ
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
"మోసగాళ్ళు " మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ వాస్తవ సంఘటన నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. కాజల్ అగర్వాల్ , సునీల్ శెట్టి , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ CS సంగీతం అందిస్తున్నారు. "మోసగాళ్ళు " మూవీ జూన్ 5వ తేదీ రిలీజ్ కావాల్సివుండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
గిరిజన యువతి పాత్రలో కాజల్ అగర్వాల్?
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు ,తమిళ , హిందీ భాషలలో రూపొందిన "అరణ్య " మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ప్రముఖ పర్యావరణ వేత్త , గిరిజన రైతు జయదేవ్ పాయంగ్ జీవిత చరిత్ర ఆధారంగా "అరణ్య " మూవీ రూపొందింది. అస్సాం రాష్ట్రం లోని నిరుపయోగ భూమిని 40సంవత్సరాలుగా మొక్కలు నాటి అడవిగా జయదేవ్ మార్చారు.
ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ - బ్రదర్ అండ్ సిస్టర్ గా కాజల్- విష్ణు..!
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన కాజల్-విష్ణు అర్ధనారీశ్వరం రూపంలో ఉన్న పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

థ్రిల్లర్ టీవీ సిరీస్ లో కాజల్ అగర్వాల్
ABC స్టూడియోస్ బ్యానర్ పై జోషువా సఫ్రాన్ దర్శకత్వంలో థ్రిల్లర్ టీవీ సిరీస్ "క్వాంటికో" (2005 ) రూపొందింది. ఈ సిరీస్ లో 3 సీజన్ లలో 57 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి."క్వాంటికో" టీవీ సిరీస్ ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ గా ప్రియాంక చోప్రా నటించారు. ఇప్పుడు "క్వాంటికో" టీవీ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సస్పెండెడ్ కాఫీ.. మీల్.... అంటే తెలుసా..? మనదగ్గర కూడా రావాలి..!
హీరో హీరోయిన్స్ అంటే కేవలం సినిమాలే కాదు సమాజ సేవలో కూడా ముందుంటున్నారు. ఎంతోమంది ఎన్నో సేవలు అందిస్తున్నారు. కొంతమంది బయటకి చెప్పకుండా కూడా చేస్తున్నారు. అందులో కాజల్ కూడా ఉంది. మూడో కంటికి తెలియకుండా సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. అరకు ప్రాంతంలో అత్యంత వెనుకబడి ఉన్న గిరిజన పిల్లలకు ఉచిత విద్య, బాలికలు, యువతుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, శానిటైజేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా కాజల్ పెట్టిన పోస్ట్ ఒకటి అందర్నీ ఆలోచింపచేస్తుంది. అదేంటంటే...
ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం - కాజల్ అగర్వాల్
తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో మెడిటేషన్ , యోగా , వర్కౌట్ , టీవీ లో రామాయణం , మహాభారతం సీరియల్స్ చూస్తూ , భగవద్గీత, భాగవత పురాణాలు పఠిస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, ఆన్ లైన్ క్లాసెస్ కు అటెండ్ అవుతూ కాజల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హేయ్ సనమిక (తమిళ ), "ముంబై సాగ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

తాజ్ మహల్ "చందమామ "
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఆగ్రా సిటీ లో యమునా నది ఒడ్డున నిర్మించిన తాజ్ మహల్ 1632 సంవత్సరం లో నిర్మాణం ప్రారంభమై 1648 సంవత్సరంలో పూర్తయింది. మొఘల్ సంస్థాన రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మించిన తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ వరల్డ్ గా డిక్లేర్ చేయబడిన తాజ్ మహల్ ప్రతీ రోజూ వేలాది సందర్శకులతో విరాజిల్లుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో తాజ్ మహల్ ను సందర్శించారు.
జన్మదిన శుభాకాంక్షలు
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ "చందమామ" మూవీ తో గుర్తింపు పొంది బ్లాక్ బస్టర్ "మగధీర "మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. "పళని " మూవీ తో కోలీవుడ్ కు కాజల్ పరిచయం అయ్యారు. పలు తమిళ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ స్టార్ హీరోలతో పలు చిత్రాలలో జోడీ గా నటించిన కాజల్ 50 చిత్రాలకు పైగా నటించారు.
సాయం చేద్దాం - కాజల్ అగర్వాల్
కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ సమయం లో రెండున్నర నెలలపాటు ఇంటికే పరిమితం అయిన ప్రజలు అన్ లాక్ 1.0 తో తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నులయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా పిల్లలు , వృద్ధులు పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం తెలిసిందే. పిల్లలు , వృద్ధులపై కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో వారిని బయటకు వెళ్ళనీయొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
మచ్చలేని "చందమామ "
13 సంవత్సరాలుగా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి తెలుగు , తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త కోర్సులు నేర్చుకొంటూ, బుక్స్ చదువుతూ, వంట చేస్తూ కాజల్ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో నేర్చుకున్నా..!
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఇక ఈ లాక్ డౌన్ వల్ల బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సినిమాలు షూటింగ్లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దొరికిన కాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది వంటలతో ప్రయోగాలు చేస్తుంటే.. మరికొంతమంది కొత్త కొత్త విషయాలు నేర్చుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కూడా పలు కొత్త విషయాలు నేర్చుకుందట.