హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కాజల్ – థాంక్యూ తమ్మీ

Kajal Aggarwal Thanks Tamannaah On Instagram

కలువ కళ్ల సుందరి.. టాలీవుడ్ చందమామ కాజల్ కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. అక్టోబర్ 30న పెళ్లి పెళ్ళి కి ముహూర్తం పెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా కాబట్టి పెద్ద హడావుడి లేకుండా సింపుల్ గానే కానిచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇరు కుటుంబసభ్యులతో పాటు చాలా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తమన్నా-కాజల్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన తమన్నాను కాజల్ తో ఫ్రెండ్ షిప్ గురించి చెప్పమన్నాడు. ఈ సందర్భంగా తమన్నాఇక `కాజల్‌కు, నాకు మధ్య స్నేహం చాలా రోజుల క్రితం మొదలైంది. మేం ఎప్పుడు కలిసినా చాలా ఎక్కువ సేపు మాట్లాడుకుంటాం. చాలా సరదాగా గడుపుతాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కాజల్` అంటూ తమన్నా పేర్కొంది. తమన్నా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన కాజల్.. `నీ విషెస్‌కు థాంక్యూ తమ్మీ. నిన్ను త్వరలోనే కలుస్తాన`ని పేర్కొంది.

కాగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =