
ట్యాగ్ · 23 కథనాలు


సలార్ లో నా రోల్ కెరీర్ బెస్ట్ రోల్

సలార్ పాత్రపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మహేష్ సినిమాలో మరింత క్రూరంగా

పుష్ప 2 లో జగ్గూ భాయ్

సల్లూ భాయ్ కోసం రెడీ అవుతున్నా

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!

జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్

'సలార్'.. జగపతిబాబు లుక్ రిలీజ్

'లక్ష్య' జగపతిబాబు లుక్ రిలీజ్

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్

"అఖండ "లో అఘోర గా జగపతి బాబు ?

'హీరో' డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న జగ్గూభాయ్

RC16లో టాలీవుడ్ స్టార్ యాక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు.

సలార్ లో నా రోల్ కెరీర్ బెస్ట్ రోల్
సెకండ్ ఇన్నింగ్స్ తరువాత బిజీ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది జగపతిబాబు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ హీరో అనిపించుకున్న జగపతిబాబు ఇప్పుడు విభిన్నమైన పాత్రలతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగు లోనే కాదు పలు భాషల్లో సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే జగపతిబాబు ఖాతాలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి.

సలార్ పాత్రపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తెలుగు లో సలార్, పుష్ప 2, మహేష్ బాబు సినిమా లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పలు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన రామబాణం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ఆయన కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

మహేష్ సినిమాలో మరింత క్రూరంగా
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

పుష్ప 2 లో జగ్గూ భాయ్
ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి...ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు. గతంలో ఫ్యామిలీ సినిమాలంటే జగపతిబాబు సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం... సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకపక్క విలన్ పాత్రలు చేస్తూనే... మరోపక్క ఫాథర్ పాత్రలు కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు. ఇప్పుడు తెలుగులో…

సల్లూ భాయ్ కోసం రెడీ అవుతున్నా
ఫ్యామిలీ సినిమాలంటే గుర్తొచ్చే హీరోల్లో జగపతిబాబు కూడా ముందుంటాడు. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం... సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి...ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు జగపతి బాబు.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో ఒక సాధారణ యువతి షూటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశం తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' రివ్యూ
ఓవరాల్‌గా చూస్తే గుడ్ లక్ సఖి సినిమా పూర్తి భిన్న కథాంశ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ కు ఈసినిమా మరింత నచ్చుతుంది.

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్
నటీనటులు.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు దర్శకత్వం.. నగేష్ కుకునూర్ బ్యానర్స్.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాత.. సుధీర్ చంద్ర సహ నిర్మాత- శ్రావ్య వర్మ సమర్పణ.. దిల్ రాజు సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి.. చిరంతన్ దాస్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!
తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది కీర్తిసురేష్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక ఆతరువాత అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళుతుంది. ఈనేపథ్యంలోనే కీర్తి సురేష్ నుండి వస్తున్న మరో మహిళా ప్రాధాన్యమైన సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫైనల్ గా రేపు జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ
"సింహ స్వప్నం" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన జగపతిబాబు పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న జగపతి బాబు సూపర్ హిట్ "లెజెండ్ " మూవీ తో విలన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి జగపతిబాబు తెరపై కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. .జగపతి బాబు ప్రస్తుతం "గుడ్ లక్ సఖి ", "పుష్ప ", "సలార్ ", "గని ", "లక్ష్య " మూవీస్ , ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

'రిపబ్లిక్' జగపతిబాబు పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు. జగపతిబాబు నటించిన చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా రిపబ్లిక్.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'
దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా నేపథ్యంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నేడు సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకి సెన్సార్ యూ / ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా చెబుతూ.. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్
గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ ను మళ్లీ వాయిదా వేస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. దానికి కారణం సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడమే. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటుపడినా సినిమా రిలీజ్ ను వాయిదా వేయడమే బెటర్ అన్న ఆలోచనలు చేస్తున్నారన్న కథనాలు అయితే వస్తున్నాయి.

'సలార్'.. జగపతిబాబు లుక్ రిలీజ్
ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగపతి బాబు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా పవర్ ఫుల్ పాత్రలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలకు సైతం జగపతిబాబే కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. ఇప్పటికే జగ్గూభాయ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. వీటిలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'లక్ష్య' జగపతిబాబు లుక్ రిలీజ్
సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో జగపతిబాబు 'పార్ధసారధి' అనే పాత్రను పోషిస్తున్నట్టు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్
ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతిబాబు.. ఇప్పుడు విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో సాయి తేజ్ హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలిజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా ఖచ్చితంగా థియేటర్ల లోనే రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

"అఖండ "లో అఘోర గా జగపతి బాబు ?
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'హీరో' డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న జగ్గూభాయ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా “హీరో”తో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈవిషయాన్ని జగ్గూభాయ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.