త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా తన పాత్రపై జగపతిబాబు పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాలో బసిరెడ్డి పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మహేష్ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్నా.. ఈసినిమాలో మరింత క్రూరంగా పవర్ ఫుల్ గా త్రివిక్రమ్ నా పాత్రను డిసైట్ చేశారు అంటూ తెలిపారు. మరి చూద్దాం ఏ రేంజ్ లో జగపతిబాబు భయపెడతాడో..
కాగా ఈసినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: