RC16లో టాలీవుడ్ స్టార్ యాక్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ #RC16లో కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ (శివన్న) కూడా ఓ కీలక రోల్ పోషించనున్నారు.

ఈ క్రమంలో తాజాగా మరో అఫీషియల్ న్యూస్ వచ్చింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ జగపతిబాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మేరకు నేడు చిత్ర యూనిట్ RC16 ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కీలక ప్రకటన చేసింది. సినిమాలో జగపతిబాబు ఒక కమాండింగ్ క్యారెక్టర్ ప్లే చేయనున్నట్టు తెలిపింది.

ఇక #RC16 సినిమాకు అత్యున్నత సాంకేతికవర్గం సహకారం అందిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేయనున్నారు. ‘గేమ్ ఛేంజర్’ మరియు RC16 చిత్రాలు రెండూ భారీ ప్రాజెక్టులు కావడం, అందునా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో మెగా అభిమానులు వీటికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.