ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగపతి బాబు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా పవర్ ఫుల్ పాత్రలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలకు సైతం జగపతిబాబే కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. ఇప్పటికే జగ్గూభాయ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. వీటిలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాాగా ఈసినిమా నుండి జగపతిబాబు లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. జగపతి బాబును రాజమనార్ గా చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక జగ్గూ భాయ్ రస్టిక్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Introducing #Rajamanaar. Thank you @IamJagguBhai garu for being a part of #Salaar.#Prabhas @shrutihaasan @VKiragandur @hombalefilms @HombaleGroup @bhuvangowda84 @BasrurRavi @shivakumarart @anbariv pic.twitter.com/BXbdrETQEF
— Prashanth Neel (@prashanth_neel) August 23, 2021
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఇక కె.జి.యఫ్ ను మించి ఈసినిమా ఉంటుందని ఎప్పుడైతే ఇటీవల వార్తలు వచ్చాయో దాంతో సినిమాపై మరిన్నిఅంచనాలు పెరిగాయి. మరి చూద్దాం కె.జి.యఫ్ ను మించి ఈసినిమా ఉంటుందేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: