
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


'దొంగాట' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
పదివేల మందికి సాయం..!

2021.. డిఫరెంట్ రోల్స్ తో జగ్గూ భాయ్
ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి...ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు. గతంలో ఫ్యామిలీ సినిమాలంటే జగపతిబాబు సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం... సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకపక్క విలన్ పాత్రలు చేస్తూనే... మరోపక్క ఫాథర్ పాత్రలు కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు.

'దొంగాట' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అమాయకమైన అమ్మాయిగా సౌందర్య నటన.. దొంగగా జగపతి బాబు నటన.. సౌందర్య ను మోసం చేసే పాత్రలో సురేష్ నటన ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు కాబట్టే సినిమా అంత గొప్ప విజయం దక్కించుంది. కోడి రామకృష్ణ అంటేనే కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈసినిమాలో కూడా కామెడీ అదే రేంజ్ లో ఉంటుంది. మరి ఆ సినిమానుండి కామెడీ సీన్స్ మీకోసం ...
పదివేల మందికి సాయం..!
గుప్త దానాలు.. ఈ పేరు వినే వుంటారు కదా. అంటే మనం సాయం చేసినా పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండటమే కదా దాని అర్ధం. ఇప్పుడు దీని గురించి ఎందుకంటే.. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో పేదలను ఆడుకోడానికి ఎంతో మంది సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి కూడా విదితమే. సినీ ప్రముఖులు దగ్గరనుండి సామాన్య ప్రజల దాకా వారికి తోచినంత వారు తమ వంతు సాయం చేస్తున్నారు.