పుష్ప 2 లో జగ్గూ భాయ్

jagapathi babu confirms entry in allu arjuns pushpa 2

ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి…ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు. గతంలో ఫ్యామిలీ సినిమాలంటే జగపతిబాబు సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం… సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకపక్క విలన్ పాత్రలు చేస్తూనే… మరోపక్క ఫాథర్ పాత్రలు కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు. ఇప్పుడు తెలుగులో మాత్రమే తమిళ్, హిందీ, కన్నడ ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా జగ్గుభాయ్ మరో బంపరాఫర్ ను కొట్టేశాడు. పుష్ప 2 లో జగపతిబాబు కు ఛాన్స్ దక్కింది. తాజాగా తన చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు దీనిని స్పష్టం చేశారు. రంగస్థలం తరువాత సుకుమార్ తో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంది.. సుకుమార్ తో కలిసి పనిచేయడం ఎగ్జైటింగ్ గా ఉంది..ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు.. పుష్ప2 ఒక ఛాలెంజ్.. నేను సవాళ్లను ఇష్టపడతాను.. సుకుమార్ నాకు మంచి పాత్రలు ఇచ్చాడు.. అతనితో పనిచేయడానికి ఎప్పుడూ ఇష్టపడతాను.. పుష్ప ఫస్ట్ పార్ట్ అయితే నాకు నచ్చింది అని అన్నారు. ఇంకా తన పాత్ర గురించి అడుగగా.. వచ్చే ఏడాది బిగ్ స్క్రీన్ పై చూడండి అంటూ సస్పెన్స్ లోనే ఉంచారు. చూద్దాం మరి ఈసినిమాలో జగ్గూభాయ్ ను ఎలాంటి పాత్రలో చూపిస్తాడో సుకుమార్.

మరి పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో చూశాం. ఇక భారీ అంచనాలతో పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స ను రిలీజ్ చేస్తే ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి మొదటి పార్ట్ తో ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్ తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.