
ట్యాగ్ · 20 కథనాలు


మిస్ ఇండియా రేస్ లో శివాని రాజశేఖర్

'శేఖర్' ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఫిక్స్

పొంగల్ బరిలోకి 'శేఖర్'..!

'శేఖర్' షూటింగ్ రీ స్టార్ట్ చేసిన రాజ శేఖర్

"#GOPICHAND 30" మూవీ లో విలన్ గా రాజశేఖర్ ?

రాజ "శేఖర్ " మూవీ లో ఇద్దరు హీరోయిన్స్

రాజశేఖర్ "మర్మాణువు "
'గతం' డైరెక్టర్ తో రాజశేఖర్ 92 సినిమా

హీరో రాజ శేఖర్ కొత్త చిత్రం ప్రారంభం
రాజశేఖర్ హెల్త్ పై జీవిత క్లారిటీ
రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది
రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ
నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది
నాన్న బాగానే ఉన్నారు - ఫేక్ న్యూస్ నమ్మొద్దు
అవును మాకు కరోనా పాజిటివ్ వచ్చింది

రాజశేఖర్ కొత్త సినిమా మాన్ స్టర్ ప్రారంభం
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న రాజశేఖర్ న్యూ మూవీ నిన్న హైదరాబాద్ లోపూజ కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మాన్ స్టర్ మూవీ తెరకెక్కుతుంది. హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ కి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

మిస్ ఇండియా రేస్ లో శివాని రాజశేఖర్
సీనియర్ యాక్టర్ రాజశేఖర్ , యాక్ట్రెస్ , డైరెక్టర్ జీవిత ల పెద్ద కుమార్తె మోడల్ , డ్యాన్సర్ శివాని రాజశేఖర్ "అద్భుతం", WWW" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. శివాని సోదరి శివాత్మిక "దొరసాని "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివాని తన సోదరి తో కలసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొంటున్నట్టు శివాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

రీల్ లైఫ్ లోనూ తండ్రీ కూతుళ్ళు గా రాజశేఖర్ , శివాని
వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ బ్యానర్స్ పై జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరో రాజశేఖర్ హీరోగా "శేఖర్" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రాజశేఖర్ 91 వ మూవీ గా తెరకెక్కుతున్న "శేఖర్ "మూవీ లో ఆయన పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

'శేఖర్' ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఫిక్స్
'గరుడ వేగ', 'కల్కీ' లాంటి సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాలను చేస్తున్నాడు. రాజశేఖర్ హీరోగా లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'శేఖర్'. ఆమధ్య షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

పొంగల్ బరిలోకి 'శేఖర్'..!
సీనియర్ హీరో రాజశేఖర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇటీవలే రీసెంట్ గా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజశేఖర్ తన శేఖర్ సినిమాను కూడా పొంగల్ బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

'శేఖర్' షూటింగ్ రీ స్టార్ట్ చేసిన రాజ శేఖర్
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. హీరో రాజ శేఖర్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నారు. రాజశేఖర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు చిత్రయూనిట్. అరకులో ఈరోజు తాజా షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక సుమారు 20 రోజుల పాటు అంటే నెలాఖరు వరకు అరకులో షూటింగ్ చేసి... ఆ తర్వాత హైదరాబాద్ లో కొద్ది రోజులు... ఆతరువాత…

"#GOPICHAND 30" మూవీ లో విలన్ గా రాజశేఖర్ ?
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా కబడ్డీ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా " సీటీమార్ " విడుదలకు సిద్ధంగాఉంది. బి గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ ,నయనతార జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ "మూవీ కూడా రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పక్కా కమర్షియల్ "మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాజ "శేఖర్ " మూవీ లో ఇద్దరు హీరోయిన్స్
సక్సెస్ ఫుల్ "తలంబ్రాలు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజశేఖర్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన హీరో రాజశేఖర్ పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో రాజశేఖర్ ప్రస్తుతం "మర్మాణువు "మూవీ లో నటిస్తున్నారు. రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా రాజశేఖర్ 91 వ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది.

రాజశేఖర్ "మర్మాణువు "
పెగాసస్ కార్పొరేషన్ , మహా యాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కంచర్ల పాలెం ", "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య "మూవీస్ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి డిఫరెంట్ టైటిల్"మర్మాణువు " ను కన్ ఫర్మ్ చేశారు. "మర్మాణువు " మూవీ లో హీరో రాజశేఖర్ క్యారెక్టర్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని సమాచారం.
'గతం' డైరెక్టర్ తో రాజశేఖర్ 92 సినిమా
కల్కీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రీసెంట్ గానే రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అయన 91వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'శేఖర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.
రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ఈ గ్యాప్ లో పలువురి డైరెక్టర్స్ తో సినిమా ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అసలే లాక్ డౌన్ వల్ల లేట్ అయింది అనుకుంటే రాజశేఖర్ కు కూడా కరోనా రావడంతో ఇంకా లేట్ అయింది. ఇప్పుడు పూర్తి గా కోలుకున్నారు. షూటింగ్ కు రెడీ అవుతున్నారు.

హీరో రాజ శేఖర్ కొత్త చిత్రం ప్రారంభం
సూపర్ హిట్ "ప్రతిఘటన "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజ శేఖర్ కెరీర్ ప్రారంభంలో నెగటివ్ రోల్స్ లో నటించినా హీరో గా సెటిల్ అయ్యారు. యాంగ్రీ యంగ్ మెన్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "తలంబ్రాలు " మూవీ కి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ , "మగాడు ", "అన్న" మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా రాజశేఖర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సక్సెస్ ఫుల్ స్పై ఫిల్మ్" PSV గరుడ వేగ " మూవీ లో రాజశేఖర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కోలుకున్న రాజ శేఖర్ - హాస్పిటల్ నుండి డిశ్చార్జ్
టాలీవుడ్ ను కరోనా బాగానే పట్టి పీడిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. కొంతమంది అయితే కోలుకున్నారు కానీ కొంతమందిని మాత్రం కోల్పోకతప్పలేదు. ఎస్పీబీ లాంటి గాన గంధర్వుడిని సైతం ఈ కరోనా మహమ్మారి బలిగొంది. ఇక ఈ రోజు మెగాస్టార్ చిరు సైతం కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేసి పెద్ద షాకే ఇచ్చారు. దీనితో అందరూ చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
రాజశేఖర్ హెల్త్ పై జీవిత క్లారిటీ
తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పిల్లలు శివాని, శివాత్మికలు ముందు కరోనా నుండి కోలుకోగా ఇటీవలే జీవిత కూడా రికవరీ అవ్వడంతో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక ఇదిలా రాజశేఖర్ హెల్త్ పై ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేస్తూనే వున్నారు సిటీ న్యూరో ఆసుపత్రి యాజమాన్యం. ఇక పిల్లలు శివాని, శివాత్మిక కూడా సోషల్ మీడియా ద్వారా తమ తండ్రి ఆరోగ్యం గురించి అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు. ఇప్పుడు తాజాగా రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ హెల్త్ గురించి.. ఆయన హెల్త్ పై వస్తున్న వార్తలు గురించి క్లారిటీ ఇచ్చారు.
రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది
కరోనా వల్ల ఇప్పటికే సినీపరిశ్రకు భారీ నష్టమే వాటిల్లింది. సినిమా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడి... పరిశ్రమ కోట్లాది రూపాయలను నష్టపోయింది. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడిన సామెతలాగ మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం కూడా ఇండస్ట్రీని కుదేలు చేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రిటీస్ కరోనా పడ్డారు.. కొంతమంది అయితే ప్రాణాలు సైతం వదిలారు. ఇక తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ
గతకొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే పిల్లలు శివాని.. శివాత్మిక భార్య జీవిత రికవరీ అవ్వగా రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూనే వున్నారు. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో రాజశేఖర్ మాత్రం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో శివాని.. శివాత్మిక.. వైద్య సిబ్బంది రాజశేఖర్ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు.
నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది
గత కొద్దిరోజుల క్రితం రాజశేఖర్ కుటుంబం అంతా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కూతుర్లు శివాని, శివాత్మికలు ఇప్పటికే కోలుకున్నారు కూడా. ఇక జీవితకు కూడా మళ్లీ కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు రాజశేఖర్ కు మాత్రం ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. శివాత్మిక రెండు రోజుల క్రితం తన తండ్రి కరోనాతో పోరాడుతున్నారని.. మీ ప్రేమ, అభిమానం, ప్రార్ధనలు ఆయనని కాపాడతాయని భావిస్తున్నాము.. . మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను అంటూ శివాత్మిక తన ట్వీట్ చేసింది
శివాత్మిక ధైర్యంగా ఉండండి - రాజశేఖర్ త్వరగా కోలుకుంటారు
రాజశేఖర్ దంపతులు ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రోజు ఉదయం తన తండ్రి ఆరోగ్యం గురించి శివాత్మిక తన ట్విట్టర్ ద్వారా.. నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దు. అందరు ధైర్యంగా ఉండండి అని తన ట్వీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
నాన్న బాగానే ఉన్నారు - ఫేక్ న్యూస్ నమ్మొద్దు
ఇటీవలే తన కుటుంబం అంతా కరోనా బారిన పడిందని రాజశేఖర్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడ్డారని.. తన ఇద్దరు కూతుర్లు శివాని, శివాత్మిక కోలుకున్నారని, తనతో పాటు తన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్పష్టం చేశారు రాజశేఖర్. ఇదిలా ఉండగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త డిఫికల్ట్ గా ఉందని.. నాన్న కాస్త కష్టంగా కరోనాతో పోరాడుతున్నారు. మీ ప్రేమ, అభిమానం, ప్రార్ధనలు ఆయనని కాపాడతాయని భావిస్తున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రార్ధిస్తున్నాను. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను…
అవును మాకు కరోనా పాజిటివ్ వచ్చింది
కరోనాకు గురవుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా. ఇక ఇప్పుడు మరో హీరో కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అది ఎవరిదో కాదో రాజశేఖర్ ఫ్యామిలీ. రాజశేఖర్, జీవిత కరోనా బారిన పడ్డారని.. గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్.