కల్కీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రీసెంట్ గానే రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అయన 91వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘శేఖర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండు రోజుల గ్యాప్ తోనే 92వ సినిమాను ప్రకటించేశాడు. గతం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన కిరణ్ కొండమడుగల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మందు గ్లాసు, కళ్ళద్దాలు, బుల్లెట్స్, గన్ , న్యూస్ పేపర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్నట్టు తెలుస్తుంది. షూటింగ్ మొత్తం అమెరికాలోనే చేయనున్నట్టు తెలుస్తుంది… ఆగస్టులో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసి… 2021 ఎండింగ్ లోనే ఈచిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Elated to team up with the makers of Gatham! #RS92 will be an action film to remember,
Hope you all like the theme poster🙌🏼@off_beat_films @SOriginals1 @PegasusCineC@kkondamadugula @Rshivani_1 @ShivathmikaR @bpoldaz @nooble451 @HarshaPratap @Surendraknaidu @Ticket_Factory pic.twitter.com/A9t58H3v7Q— Dr.Rajasekhar (@ActorRajasekhar) February 6, 2021
కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రదర్శితమైంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























