
ట్యాగ్ · 73 కథనాలు


గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30

నాని 30 ఓపెనింగ్ డేట్ ఫిక్స్

భలే భలే మగాడివోయ్ మూవీ సీక్వెల్ చేయాలనుంది: నాని

ఒక్క రోజులో స్టార్ ను కాలేదు - నాని

అల్లూరి మూవీ ట్రైలర్ పై హీరో నాని స్పందన

హీరో నాని "దసరా" మూవీ అప్ డేట్

హీరో నాని చేతులమీదుగా "మసూద" మూవీ టీజర్ రిలీజ్

ఫ్యాన్ బాయ్ మూమెంట్..!

నాని బ్యాక్ టు 'దసరా'

'అంటేసుందరానికీ' హిలేరియస్ గా ఉంటుంది..!

కన్నడ ప్రేక్షకులకు 'న్యాచురల్ స్టార్' సారీ..!

గోదావరిఖని లో 'దసరా' టీమ్..!

"దసరా" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

నాని 'దసరా' నుండి క్రేజీ అప్ డేట్..!

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!

నాని "అంటే .. సుందరానికీ !" మూవీ షూటింగ్ పూర్తి

పాన్ ఇండియా మూవీపై హీరో నాని అభిప్రాయం

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరుతూ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి అంజన, తనయుడు అర్జున్ మరియు సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఉన్నారు.

గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30
విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నాని 30 ఓపెనింగ్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు నాని తన 30 వ సినిమాను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ఓపెనింగ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమా ప్రారంభ పూజా…

భలే భలే మగాడివోయ్ మూవీ సీక్వెల్ చేయాలనుంది: నాని
ఆముక్త క్రియేషన్స్ , నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బ్రహ్మాజీ , సుదర్శన్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రవీణ్ లక్కరాజు , రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఒక్క రోజులో స్టార్ ను కాలేదు - నాని
ఢీ , రాధాగోపాలం మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన నాని , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అష్టా చమ్మా మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. రైడ్, భీమిలి కబడ్డి జట్టు వంటి మూవీస్ తో నాని ప్రేక్షకులను అలరించారు. అలా మొదలైంది, .పిల్ల జమీందార్ మూవీస్ విజయం సాధించడంతో నాని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ ఈగ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నాని హీరోగా రూపొందిన భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, ‘జెంటిల్ మన్, మజ్ను , నేను లోకల్ ,నిన్నుకోరి , మిడిల్ క్లాస్ అబ్బాయి , జెర్సీ మూవీస్ విజయం సాధించాయి.

అల్లూరి మూవీ ట్రైలర్ పై హీరో నాని స్పందన
లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కాయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హీరో నాని "దసరా" మూవీ అప్ డేట్
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాని మరో వైవిధ్య భరిత మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో “దసరా “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

నాని 'దసరా'.. ఫ్రెండ్ షిప్ డే పోస్టర్ రిలీజ్..!
ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని ఆసినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక వెంటనే తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ ను పెట్టేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గరలోని ఓ గ్రామ నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగనుంది. అయితే నాని తన కెరీర్ లో మాస్ పాత్రలు చేసినా ఈ సినిమాలో మాత్రం ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు.

హీరో నాని చేతులమీదుగా "మసూద" మూవీ టీజర్ రిలీజ్
"మళ్లీ రావా", "ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ" చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్నా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్.బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో "జార్జిరెడ్డి" మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్‌లో "మసూద" మూవీ తెరకెక్కుతుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఫ్యాన్ బాయ్ మూమెంట్..!
నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ప్రాజెక్ట్ కే మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, న్యాచురల్ స్టార్ నాని, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇంకా పలువురు ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో అమితాబ్ తన ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేసి సినిమా దిగ్గజాలతో ఓ…

నాని బ్యాక్ టు 'దసరా'
న్యాచురల్ స్టార్ నాని కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఇక ఇప్పుడు తన ఫోకస్ ను దసరా పై షిప్ట్ చేశాడు. నిజానికి ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టాడు నాని. అంటే సుందరానికి సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగానే ఆసినిమాతో పాటు గానే ఈసినిమా షూటింగ్ లో పాల్గొనేవాడు. అయితే మధ్యలో అంటే సుందరానికి సినిమా రిలీజ్ అవ్వడం.. ఆసినిమా ప్రమోషన్స్ తో నాని బిజీ అయిపోయాడు. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా తరువాత మళ్లీ ట్రిప్ కు వెళ్లాడు. ఇప్పుడు ట్రిప్ నుండి కూడా నాని…

'అంటేసుందరానికీ' హిలేరియస్ గా ఉంటుంది..!
అంటే సుందరానికీ' హిలేరియస్ గా వుంటుంది..కొత్త నాని ని చూస్తారు: నేచురల్ స్టార్ నాని ఇంటర్వ్యూ నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో హీరో నాని మీడియాతో ''అంటే సుందరానికీ'…

కన్నడ ప్రేక్షకులకు 'న్యాచురల్ స్టార్' సారీ..!
ఈమధ్య న్యాచురల్ స్టార్ నాని ఏం మాట్లాడినా వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల టికెట్ల రేటు పెంపుపై మాట్లాడగా అప్పట్లో దానిపై పెద్దఎత్తున చర్చలే జరిగాయి. ఇక ఇప్పుడు మరోసారి నాని చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకులకు కోపం తెప్పించాయి.. అసలు సంగతేంటంటే నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గోదావరిఖని లో 'దసరా' టీమ్..!
న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక సినిమా తరువాత మరొక సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పటికే అంటే సుందరానికి సినిమా కంప్లీట్ చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు.

"దసరా" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ "శ్యామ్ సింగ రాయ్ " మూవీ తరువాత నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

నాని 'దసరా' నుండి క్రేజీ అప్ డేట్..!
గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికి సినిమా కూడా ఒకటి. కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూన్ 10న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ నిర్మాతల నుండి 'నాని' కి స్పెషల్ బర్త్ డే విషెస్..!
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించి.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో తన మార్క్ ను చూపించి ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్పెషల్ పేజీని ఏర్పాటుచేసుకున్న హీరో నాని. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు పొందిన నాని.. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎక్కువ శాతం సక్సెస్ రేటునే సొంతం చేసుకున్న నాని... ఫ్లాప్స్ వచ్చినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తనపని తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నేడు నాని తన పుట్టినరోజు జరుపుకుంటుండగా తన సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చేశాయి. అలానే నానికి…

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు నాని. ప్రస్తుతం నాని తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

నాని "అంటే .. సుందరానికీ !" మూవీ షూటింగ్ పూర్తి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీపై హీరో నాని అభిప్రాయం
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని ప్రస్తుతం "అంటే .. సుందరానికీ ! మూవీ లో నటిస్తున్నారు.