ఒక్క రోజులో స్టార్ ను కాలేదు – నాని

Nani about his star status, Natural Star Nani about his star status, Hero Nani, Natural Star Nani, Shyam Singha Roy, Ante Sundaraniki, Tuck Jagadish, Nani Latest Movie, Nani Upcoming Movies, Dasara Movie, Dasara Telugu Movie, Nani's Dasara Movie, Dasara Movie Latest Update, Dasara Movie Latest News And Updates, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఢీ , రాధాగోపాలం మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన నాని , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అష్టా చమ్మా మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. రైడ్, భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు వంటి మూవీస్ తో నాని ప్రేక్షకులను అలరించారు. అలా మొద‌లైంది, .పిల్ల జమీందార్ మూవీస్ విజయం సాధించడంతో నాని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ ఈగ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నాని హీరోగా రూపొందిన భలే భలే మగాడివోయ్, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ, ‘జెంటిల్ మ‌న్, మజ్ను , నేను లోకల్ ,నిన్నుకోరి , మిడిల్ క్లాస్ అబ్బాయి , జెర్సీ మూవీస్ విజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని మన చుట్టూ జరిగే కథలు, సహజమైన పాత్రలను ఎంచుకుంటూ నేచురల్‌ స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది కాలంగా కథల ఎంపికలో నాని స్ట్రాటజీ వర్కవుట్‌ కావడం లేదు. వీ, టక్‌ జగదీశ్‌, శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికీ! సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తన కెరీర్‌పై ఇటీవల నాని స్పందిస్తూ…ఒక్క రోజులో నేను స్టార్‌ను కాలేదనీ , .వరుస విజయాలు వచ్చినప్పుడే, ఏదో ఒక రోజు అపజయాలూ వస్తాయనీ , వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నాననీ , వాస్తవికతతో ఉండే వ్యక్తిత్వం తనదనీ ,ఇకపైనా వినూత్నమైన కథలను ఎంచుకుంటూ కొనసాగుతాననీ , సినిమాలో నటించడం తనకు ఇష్టం అనీ ,తాను ప్రేమించే పని చేసే అవకాశం దక్కినందుకు ఆనందిస్తా ననీ చెప్పారు. ప్రస్తుతం నాని దసరా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =