అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించి.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో తన మార్క్ ను చూపించి ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్పెషల్ పేజీని ఏర్పాటుచేసుకున్న హీరో నాని. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు పొందిన నాని.. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎక్కువ శాతం సక్సెస్ రేటునే సొంతం చేసుకున్న నాని… ఫ్లాప్స్ వచ్చినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తనపని తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నేడు నాని తన పుట్టినరోజు జరుపుకుంటుండగా తన సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చేశాయి. అలానే నానికి పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందించారు. దీనిలో భాగంగానే తన సినిమాలను నిర్మిస్తున్న కొంతమంది నిర్మాతలు స్వయంగా కలిసి నాని కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing Natural ⭐ @NameisNani a very Happy Birthday 💖#AnteSundaraniki is going to be Super Special for all of us 🥳 pic.twitter.com/F3Y2oj67hS
— Mythri Movie Makers (@MythriOfficial) February 24, 2022
ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న అంటే సుందరానికి సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. జూన్ 10న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీనిలో పాటు దసరా సినిమాను కూడా చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: