నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరుతూ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి అంజన, తనయుడు అర్జున్ మరియు సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్న వీరు స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో నాని, కుటుంబ సభ్యులు వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రాన్ని బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
కాగా సరిపోదా శనివారం సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ అందించింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు అని హీరో నాని స్వయంగా వెల్లడించారు. వచ్చేవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు సాయంత్రం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేయనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: