ఫ్యాన్ బాయ్ మూమెంట్..!

Natural Star Nani Memorable Moment with Amitabh Bachchan,,Nani Shares His Fanboy Moment With Amitabh Bachchan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Natural star Nani,Nani,Hero Nani,Actor Nani,Tollywood Hero Nani,Nani Fan Boy Moment with Amitabh Bachchan,Nani With Amitabh Bachchan,Amithab Bachchan,Bollywood Star Amithab Bachchan, Amithab Met with South Indian Stars,Big B Amithab Bachchan mete with South Indian Star,Nani Fanboy Moment with Big B Amithab Bachchan,Nani Upcoming Movie Updates, Nani New Movie Updates,Nani Latest Fan Boy Moment with Amithab Bachchan

నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ప్రాజెక్ట్ కే మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, న్యాచురల్ స్టార్ నాని, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇంకా పలువురు ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో అమితాబ్ తన ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేసి సినిమా దిగ్గజాలతో ఓ సాయంత్రం అంటూ ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెబుతూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కు నాని రిప్లై ఇస్తూ.. ఇది తన లైఫ్ లో మర్చిపోలేని బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని లవ్ ఎమోజితో ధన్యవాదాలు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + ten =