హీరో నాని చేతులమీదుగా “మసూద” మూవీ టీజర్ రిలీజ్

Natural Star Nani Launched Masooda Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Natural Star Nani,Nani,Hero Nani,Natural Star Nani Launched Movie Teaser of Masooda,Masooda Movie Teaser,Masooda Telugu Movie Teaser,Masooda Teaser, Nani Launched Masooda Movie Teaser,Masooda Movie Teaser Out Now,Masooda Movie Teaser Released,Masooda upcoming Movie Teaser Released,Nani latest Updates,Nani New Movie Updates, Swadharm Entertainment Banners,Director Sai Kiran Adivi,Actress Sangeetha Playing a Important Role in Masooda Movie,Producer Rahul Yadav

“మ‌ళ్లీ రావా”, “ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ” చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్నా స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో “జార్జిరెడ్డి” మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్‌లో “మసూద” మూవీ తెరకెక్కుతుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “మసూద” మూవీ టీజర్ హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. టీజర్ ప్రామిసింగ్‌గా ఉందనీ , ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందనీ , ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని అనిపిస్తుందనీ నాని చెబుతూ ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “మసూద” మూవీ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని కి మా టీమ్ తరపున ధన్యవాదాలనీ , ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందనీ , మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుందనీ ,ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలనీ , త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here