నాని బ్యాక్ టు ‘దసరా’

Natural Star Nani Totally Gets Into Dasara Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Natural Star Nani,Nani,Hero Nani,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Nani Dasara Movie Shooting Updates,Natural Star Nani Latest Movie Dasara,Dasara New Movie updates, Nani Dasara Shoot Updates,Nani New Movie Updates,Dasara Movie Updates,Nani Starts Shooting For Dasara Movie,Nani Dasara Movie Updates

న్యాచురల్ స్టార్ నాని కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఇక ఇప్పుడు తన ఫోకస్ ను దసరా పై షిప్ట్ చేశాడు. నిజానికి ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టాడు నాని. అంటే సుందరానికి సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగానే ఆసినిమాతో పాటు గానే ఈసినిమా షూటింగ్ లో పాల్గొనేవాడు. అయితే మధ్యలో అంటే సుందరానికి సినిమా రిలీజ్ అవ్వడం.. ఆసినిమా ప్రమోషన్స్ తో నాని బిజీ అయిపోయాడు. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా తరువాత మళ్లీ ట్రిప్ కు వెళ్లాడు. ఇప్పుడు ట్రిప్ నుండి కూడా నాని వచ్చేశాడు. ఈనేపథ్యంలో నాని దసరా సినిమాతో బిజీ అవుతున్నాడు. ఈసినిమా షూటింగ్ లో మళ్లీ జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేసి ఈసఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 15 =