న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక సినిమా తరువాత మరొక సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పటికే అంటే సుందరానికి సినిమా కంప్లీట్ చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా దసరా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో నాని ఫుల్ డీగ్లామర్ లుక్ ఫుల్ మాస్ అండ్ రస్టింగ్ లుక్ లో కనిపించనున్నాడు. అయితే ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం గోదావరిఖనిలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా హీరో నాని, కీర్తి సురేష్‌ల మధ్య ఓ సాంగ్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్స్ ఈ పాటలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: