ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని ఆసినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక వెంటనే తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ ను పెట్టేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గరలోని ఓ గ్రామ నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగనుంది. అయితే నాని తన కెరీర్ లో మాస్ పాత్రలు చేసినా ఈ సినిమాలో మాత్రం ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు నాని. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ కు ‘ధూం ధాం దోస్తానా’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
Dhoom dhaam dostaan
Iraga maraga chedhaam ❤️🔥#HappyFriendshipDay #Dasara pic.twitter.com/0JrI1mybmf— Nani (@NameisNani) August 7, 2022
కాగా ఈసినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























