
ట్యాగ్ · 18 కథనాలు


“#AK 61 ” తమిళ మూవీలో కీలక పాత్రలో అజయ్

టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు

అజిత్ "వాలిమై" మూవీ న్యూ గ్లింప్స్ రిలీజ్

'వాలిమై' తెలుగు ట్రైలర్ రిలీజ్

22 సంవత్సరాల తరువాత హీరో అజిత్ కు జోడీగా టబు

అజిత్ "వాలిమై" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్

అభిమానులకు అజిత్ స్పెషల్ మెసేజ్

జులై 15 'వాలిమై' ఫస్ట్ లుక్..!

అజిత్ 'వాలిమై' డబుల్ ధమాకా

అజిత్ 'వాలిమై' షూటింగ్ అప్ డేట్

మూడో ఛాన్స్ కూడా ఇచ్చేశాడు..!

'వాలిమై' అజిత్ లుక్ కు బ్రేక్
'వాలిమై' నుండి త్వరలో ఫస్ట్ లుక్

ఇడ్లీ అమ్మే వ్యక్తి కి 'అజిత్' సహాయం
షూటింగ్ లో హీరో అజిత్ కు ప్రమాదం
హీరో అజిత్ రిస్కీ బైక్ స్టంట్స్

#AK 61 టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం కామన్ గా జరిగేదే . ఒక్కోసారి రెండు మూడుసార్లు కూడా సేమ్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే రిపీట్ కాబోతుంది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు హెచ్ వినోద్ ఇంకా అజిత్ ది. ఇప్పటికే అజిత్ హీరోగా హెచ్.వినోత్ దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది.

“#AK 61 ” తమిళ మూవీలో కీలక పాత్రలో అజయ్
జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై హెచ్ .వినోద్ దర్శకత్వంలో తాల అజిత్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై”,“వాలిమై”తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎడ్వెంచర్ తమిళ మూవీ “#AK 61 ” హైదరాబాద్ లో పూజాకార్యక్రమం జరుపుకుంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ పూణె లో జరుగుతుంది.

టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు
కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ , కమల్ హాసన్ , అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ , కమల్ హాసన్, కార్తీ వంటి హీరోలు తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.తమిళ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కావడం , సక్సెస్ రేటు, నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారు.

అజిత్ "వాలిమై" మూవీ న్యూ గ్లింప్స్ రిలీజ్
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ భాషలలో ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'వాలిమై' తెలుగు ట్రైలర్ రిలీజ్
హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నెర్కొండ పార్వాయి రాగా.. ఇప్పుడు వస్తుంది రెండో సినిమా. ఇక ఈ సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈసినిమాని కూడా జనవరి 13 వ తేదీన విడుదల చేసేందుకు ముందు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనాతో పాటు తమిళనాడులో థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది టీమ్. ఫైనల్ గా ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయనిట్.

22 సంవత్సరాల తరువాత హీరో అజిత్ కు జోడీగా టబు
"హమ్ నౌజవాన్ "(1985 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన టబు "కూలీ నెం . 1 "మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "కాదల్ దేశం"మూవీ తో తమిళ , "కాలాపానీ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు టబు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ హిందీ, తమిళ, మలయాళ , ఇంగ్లీష్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . అజిత్ హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ "కండుకొండెన్ కండుకొండెన్ "తమిళ మూవీ లో కథానాయికగా నటించిన టబు 22 సంవత్సరాల తరువాత "#THALA 61"మూవీ లో అజిత్ కు జోడీగా నటించనున్నారు.

అజిత్ "వాలిమై" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై పి ఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ "తమ్ముడు " మూవీ 1999 జూలై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ప్రీతీ జింగానియా కథానాయిక. పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు అరుణ్ ప్రసాద్ "తమ్ముడు" మూవీని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రమణ గోగుల సంగీతం ప్రేక్షకులను అలరించింది.

అభిమానులకు అజిత్ స్పెషల్ మెసేజ్
"ఎన్ వీడు ఎన్ కనవర్ "మూవీ లో స్కూల్ బాయ్ గా కోలీవుడ్ కు పరిచయం అయిన అజిత్ , "అమరావతి "మూవీ తో హీరోగా మారారు. "ప్రేమ పుస్తకం "మూవీ తో అజిత్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో అజిత్ తెలుగు లో నటించిన ఏకైక మూవీ "ప్రేమ పుస్తకం "కావడం విశేషం. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. అజిత్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.

జులై 15 'వాలిమై' ఫస్ట్ లుక్..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘వాలిమై’. పోలీస్ యాక్షన్ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. టాకీ పార్ట్ మొత్తం దాదాపు పూర్తి కాగా.. ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా త్వరగా పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. దాదాపు ఏడాదికి పైగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్. అయితే…

అజిత్ 'వాలిమై' డబుల్ ధమాకా
హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా వాలిమై. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ . ఇక ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకోగా. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ కు సిద్దమవుతుంది చిత్రయూనిట్.ఇక ఈసినిమా నుండి ఎంతో కాలంగా ఎలాంటి అప్ డేట్ లేని సంగతి తెలిసిందే కదా. అజిత్ బర్త్ డే కి అయినా ఫస్ట్ లుక్ వస్తుంది అనుకున్నారు కానీ అప్పుడు పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ చేయలేదు.

అజిత్ 'వాలిమై' షూటింగ్ అప్ డేట్
హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఆయన పుట్టిన రోజుకు విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్ ను కూడా ప్రస్తుతం పరిస్థితులు బాలేని నేపథ్యంలో రిలీజ్ చేయడం అంత బావుండదని మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు.

మూడో ఛాన్స్ కూడా ఇచ్చేశాడు..!
అజిత్ ఒక డైరెక్టర్ ను నమ్మితే ఎలా ఉంటుందో ఇప్పటికే చూశాం. దీనికి నిదర్శనమే డైరెక్టర్ శివతో అజిత్ చేసిన సినిమాలు. దర్శకుడు సిరుతై శివతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేశారు. వీరం, వేదం, వివేగం, విశ్వం అనే నాలుగు చిత్రాలకు అజిత్, శివ కలిసి పని చేశారు. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక ఇప్పుడు ఇలాంటి అవకాశమే మరో డైరెక్టర్ కు దక్కింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ప్రస్తుతం అజిత్ తో వాలిమై సినిమా చేస్తున్న హెచ్. వినోత్. నిజానికి హెచ్.వినోత్ తో ఇప్పటికే ఒక సినిమా చేశాడు అజిత్. అదే నెర్కొండ పార్వాయి. ఈసినిమా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్. బోనీ…

'వాలిమై' అజిత్ లుక్ కు బ్రేక్
హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు ఇక ఈసినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దాదాపు చాలా వరకూ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అజిత్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు అంటే మే 1న రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ చేసేశారు. ఈవిషయాన్ని నిర్మాత బోనీ కపూర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.
'వాలిమై' నుండి త్వరలో ఫస్ట్ లుక్
కొంత మంది తమిళ్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోల్లో అజిత్ కూడా ఒకరు. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం అజిత్ హెచ్. వినోత్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్న తెలిసిందే. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్ లో షూటింగ్ ను ముగించుకుంది. ఇంకా కొంత మేరకు మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉంది.

ఇడ్లీ అమ్మే వ్యక్తి కి 'అజిత్' సహాయం
కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. ఇక వారు చేసే సమాజ సేవ..పలువురికి చేసే గుప్తదానాలు బయటకు రావచ్చు.. రాకపోవచ్చు. అంతేకాదు వాళ్ళు కూడా బయటకు చెప్పుకోడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చుపించారనుకోండి.
షూటింగ్ లో హీరో అజిత్ కు ప్రమాదం
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ అజిత్ , హుమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
హీరో అజిత్ రిస్కీ బైక్ స్టంట్స్
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ , హుమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ , చెన్నై లలో కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "వాలిమై " మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది.