సూపర్ హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం కామన్ గా జరిగేదే . ఒక్కోసారి రెండు మూడుసార్లు కూడా సేమ్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే రిపీట్ కాబోతుంది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు హెచ్ వినోద్ ఇంకా అజిత్ ది. ఇప్పటికే అజిత్ హీరోగా హెచ్.వినోత్ దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లోనే మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అజిత్ కెరియర్ లో 61 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే తాజాాగా ఈసినిమా సంబంధించిన టైటిల్ ని మరియు అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈసినిమాకు ‘తునివు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘నో గట్స్ నో గ్లోరీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ ఫస్ట్ లుక్ లో అజిత్ గన్ పట్టుకుని కుర్చీలో రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
#Thunivu #NoGutsNoGlory#AK61FirstLook #AK61 #Ajithkumar #HVinoth @BoneyKapoor @BayViewProjOffl @SureshChandraa #NiravShah @GhibranOfficial #Milan @SupremeSundar_ @editorvijay #Kalyan #AnuVardhan @premkumaractor #MSenthil @SuthanVFX #CSethu #SameerPandit @anandkumarstill pic.twitter.com/sUVKGzYyW1
— Zee Studios (@ZeeStudios_) September 21, 2022
కాగా ఈసినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: