అజిత్ ఒక డైరెక్టర్ ను నమ్మితే ఎలా ఉంటుందో ఇప్పటికే చూశాం. దీనికి నిదర్శనమే డైరెక్టర్ శివతో అజిత్ చేసిన సినిమాలు. దర్శకుడు సిరుతై శివతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేశారు. వీరం, వేదం, వివేగం, విశ్వం అనే నాలుగు చిత్రాలకు అజిత్, శివ కలిసి పని చేశారు. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక ఇప్పుడు ఇలాంటి అవకాశమే మరో డైరెక్టర్ కు దక్కింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ప్రస్తుతం అజిత్ తో వాలిమై సినిమా చేస్తున్న హెచ్. వినోత్. నిజానికి హెచ్.వినోత్ తో ఇప్పటికే ఒక సినిమా చేశాడు అజిత్. అదే నెర్కొండ పార్వాయి. ఈసినిమా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్. బోనీ కపూర్ నిర్మించిన ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. దీంతో మళ్లీ వీరికాంబినేషన్ లోనే వాలిమై సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం అజిత్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా వినోత్ తోనే ఫిక్స్ చేసినట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై చర్చలు జరుగుతూనే ఉన్నాయట. వినోత్ చెప్పిన కథ నచ్చడంతో అజిత్ ఓకే చెప్పేశారట. ఇది కూడ పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ కథే.
మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే దీన్ని కూడ బోనీ కపూర్ నిర్మిస్తున్నారట. ఇదే నిజమైతే వీరి ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవుతుంది ఇది. చూద్దాం మరి త్వరలోనే అధికారిక ప్రకటన ఏదైనా ఇస్తారేమో…
ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వాలిమై సినిమాను ‘బేవ్యూ ప్రాజెక్ట్స్’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు త్వరలోనే పూర్తి చేసి సినిమాను కూడా తొందర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: