జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై హెచ్ .వినోద్ దర్శకత్వంలో తాల అజిత్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై”,“వాలిమై”తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎడ్వెంచర్ తమిళ మూవీ “#AK 61 ” హైదరాబాద్ లో పూజాకార్యక్రమం జరుపుకుంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ పూణె లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు సినీ పరిశ్రమ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరైన అజయ్ “స్టూడెంట్ నంబర్ 1”, “అతడు”, “ఛత్రపతి”,” విక్రమార్కుడు”, “సై”,”ఒక్కడు”, “పోకిరి”, “దేశముదురు”, “ఢీ”, “దూకుడు”, “గబ్బర్ సింగ్” లాంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు “#AK 61 ” మూవీ లో అజయ్ ఒక కీలక పాత్రకి ఎంపిక అయ్యారు. పూణె లో జరుగుతున్న షెడ్యూల్ లో అజయ్ జాయిన్ కానున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































