“ఎన్ వీడు ఎన్ కనవర్ “మూవీ లో స్కూల్ బాయ్ గా కోలీవుడ్ కు పరిచయం అయిన అజిత్ , “అమరావతి “మూవీ తో హీరోగా మారారు. “ప్రేమ పుస్తకం “మూవీ తో అజిత్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో అజిత్ తెలుగు లో నటించిన ఏకైక మూవీ “ప్రేమ పుస్తకం “కావడం విశేషం. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. అజిత్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై “మూవీలో నటిస్తున్నారు. యూరోప్ లో జరుగుతున్న “వాలిమై “మూవీ షూటింగ్ లో అజిత్ పాల్గొంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ లో 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరో అజిత్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ఫ్యాన్స్ ప్రేమ , అభిమానం , ద్వేషించే వారి ద్వేషాన్ని , న్యూట్రల్ గా వుండే వారి వ్యూస్ ను ఆనందంగా స్వీకరిస్తున్నా ననీ , లివ్ &లెట్ లివ్ , అన్ కండిషన్ లవ్ ఆల్వేస్ అంటూ అజిత్ ట్వీట్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: