హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఆయన పుట్టిన రోజుకు విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్ ను కూడా ప్రస్తుతం పరిస్థితులు బాలేని నేపథ్యంలో రిలీజ్ చేయడం అంత బావుండదని మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ దాదాపు చాలా వరకూ సినిమా షూటింగ్ పూర్తయినట్టే తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ గురించి వినోత్ మాట్లాడుతూ. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని… ఇంకా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే మిగిలి ఉందని.. పరిస్థితులు కాస్త నార్మల్ కు వచ్చిన తరువాత అది కూడా పూర్తి చేస్తామని తెలిపాడు. ఈలోపు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని.. అవి కూడా చివరి దశకు వచ్చాయని చెప్పారు. ఇక కోరనా వల్ల కొంత మంది సీనియర్ నటులు షూటింగ్ కు రాకపోవడంతో కొన్ని సీన్లు మళ్లీ రీ షూట్ చేయాల్సి వచ్చింది.. అందుకే షూటింగ్ కు ఇంత టైమ్ పట్టిందని చెప్పుకొచ్చాడు. ఇక త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి.. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘బేవ్యూ ప్రాజెక్ట్స్’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: