
ట్యాగ్ · 19 కథనాలు


షూటింగ్ లో హీరో గోపీచంద్ కు ప్రమాదం

"పక్కా కమర్షియల్"మూవీ గ్లింప్స్ రిలీజ్

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్

తేజ సినిమాపై గోపీచంద్ క్లారిటీ

సెప్టెంబర్ లో 'సీటీమార్'... థియేటర్ల లోనే

హైదరాబాద్ లో "పక్కా కమర్షియల్ "

గోపిచంద్-శ్రీవాస్ మూడోసారి
గోపీచంద్ సాహస నిర్ణయం
భార్యకు ప్రేమతో గోపీచంద్ ..!
గోపీచంద్ ‘సీటీమార్’.. ఫస్టాఫ్ తాలూకు షూటింగ్ పూర్తి

కరోనా క్రైసిస్ ఛారిటీ కి గోపీచంద్ విరాళం
విలన్ గా నటించడం నిజం కాదు - గోపీచంద్
కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సీటీ మార్"
తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!
'నో రెమ్యూనరేషన్' అంటున్న గోపీచంద్

ఫ్యామిలీ సినిమా రావడం లేదనే లోటు రామబాణం తీరుస్తుంది
'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శ్రీవాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

షూటింగ్ లో హీరో గోపీచంద్ కు ప్రమాదం
దర్శకుడు శ్రీవాస్ , యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన "లక్ష్యం", "లౌక్యం" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "#GOPICHAND30 "మూవీ తెరకెక్కుతుంది. హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ నటిస్తున్నారు.

"పక్కా కమర్షియల్"మూవీ గ్లింప్స్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా "పక్కా కమర్షియల్"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇటీవలే సిటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సీటీమార్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నాడు. సీటీమార్ సక్సెస్ సాధించడంతో ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 8న విడుదల కానుండటంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్…

తేజ సినిమాపై గోపీచంద్ క్లారిటీ
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ , తమన్నా కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా చేస్తుండగానే తేజ తో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాకు అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి ప్రకటించారు. అయితే ఆతరువాత ఈసినిమా గురించి పెద్దగా ఎక్కడా వినిపించలేదు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే "సీటీ మార్ "-గోపీచంద్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్" మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ వినాయకచవితి కానుకగా రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటించిన ఈ మూవీ లో దిగాంగన మరో కథానాయిక. పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

సెప్టెంబర్ లో 'సీటీమార్'... థియేటర్ల లోనే
మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూాడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. నిజానికి ఏప్రిల్ లోనే ఈసినిమా రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈ క్రమంలో గోపీచంద్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. రిలీజ్ డేట్‌ని త్వరలోనే…

హైదరాబాద్ లో "పక్కా కమర్షియల్ "
"తొలి వలపు "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ తరువాత "జయం"(తెలుగు , తమిళ )' ", "నిజం ", "వర్షం " వంటి మూవీస్ లో ప్రతినాయకుడిగా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తిరిగి సూపర్ హిట్ "యజ్ఞం "మూవీ తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. "రణం ", "లక్ష్యం ", "లౌక్యం ", గౌతమ్ నంద ", "చాణక్య " వంటి మూవీస్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ హీరోగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బులెట్ "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో గోపీచంద్ ప్రస్తుతం "పక్కా కమర్షియల్ "మూవీ లో నటిస్తున్నారు.

గోపిచంద్-శ్రీవాస్ మూడోసారి
గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా దీనితో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. మరోవైపు ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్ సినిమా కూడా రిలీజ్ కానుంది. థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

'పక్కా కమర్షియల్'.. గోపీచంద్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
ప్రతీరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ ఈసినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత వరకూ పూర్తవ్వగా.. పరిస్థితులు కాస్త నెమ్మదిస్తే జూలై నుండి ను కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇక రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
గోపీచంద్ తో తర్వాత సినిమా - అఫీషియల్ అనౌన్స్ మెంట్
`భలే భలే మగాడివోయ్`, మహానుభావుడు, `ప్రతిరోజూ పండగే` ఇలా వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. కమర్షియల్ ఎలిమెంట్స్ లో అయినా.. హార్రర్ జోనర్ అయినా సరే తనదైన శైలిలో కామెడీని జోడించి నవ్వించగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ మారుతి. రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్‌కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకూ ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. ఆ మధ్య మాస్ మహారాజా రవితేజతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.
గోపీచంద్ సాహస నిర్ణయం
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా "సీటీమార్ " మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో రూపొందనున్న "అలిమేలు వెంకట రమణ " మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
భార్యకు ప్రేమతో గోపీచంద్ ..!
యాక్షన్ హీరో హీరో గోపీచంద్, రేష్మ ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 2013 మే 12న వీరి వివాహం జరిగింది. శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లై ఏడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఈ రోజు పెళ్లి రోజు కావడంతో గోపీచంద్ తన భార్య గురించి చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
గోపీచంద్ ‘సీటీమార్’.. ఫస్టాఫ్ తాలూకు షూటింగ్ పూర్తి
‘గౌతమ్ నంద’(2017) తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘సీటీమార్’. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నాయికగా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

కరోనా క్రైసిస్ ఛారిటీ కి గోపీచంద్ విరాళం
కరోనా మహమ్మారి కారణం గా జనజీవవనం కష్టాలపాలయింది. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన సినీ కార్మికుల సంక్షేమానికై మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ సంస్థ ఏర్పాటయిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను ఈ సంస్థ అందజేస్తుంది.
విలన్ గా నటించడం నిజం కాదు - గోపీచంద్
"తొలి వలపు" మూవీ తో గోపీచంద్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన "జయం ", "వర్షం"మూవీస్ ఘనవిజయం సాధించాయి. గోపీచంద్ తిరిగి హీరోగా నటించిన "యజ్ఞం" మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన రణం, లక్ష్యం, శౌర్యం, సాహసం, లౌక్యం, జిల్ మూవీస్ విజయం సాధించాయి.
కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సీటీ మార్"
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ "సీటీ మార్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. దిగాంగన, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.
తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!
కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమా అన్న హిట్ అవుతుందనుకున్నాడు.. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో తన తర్వాత వచ్చే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
'నో రెమ్యూనరేషన్' అంటున్న గోపీచంద్
గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన 'చాణక్య' కూడా గోపీచంద్ ఆశలపై నీరు చల్లేసింది.