“తొలి వలపు “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ తరువాత “జయం”(తెలుగు , తమిళ )’ “, “నిజం “, “వర్షం ” వంటి మూవీస్ లో ప్రతినాయకుడిగా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తిరిగి సూపర్ హిట్ “యజ్ఞం “మూవీ తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. “రణం “, “లక్ష్యం “, “లౌక్యం “, గౌతమ్ నంద “, “చాణక్య ” వంటి మూవీస్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ హీరోగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బులెట్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో గోపీచంద్ ప్రస్తుతం “పక్కా కమర్షియల్ “మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిర్మాత అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతీ దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , రాశీఖన్నా జంటగా “పక్కా కమర్షియల్ “మూవీ తెరకెక్కుతుంది. “పక్కా కమర్షియల్ “మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో గోపీచంద్ , హీరోయిన్ రాశీఖన్నా లతో పాటు ప్రధాన తారాగణం చిత్రీకరణలో పాల్గొంటుంది. సూపర్ హిట్ “భలే భలే మగాడివోయ్”, “ప్రతిరోజూ పండగే” మూవీస్ తరువాత GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ , దర్శకుడు మారుతి కాంబినేషన్ లో “పక్కా కమర్షియల్ “మూవీ తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: