అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే “సీటీ మార్ “-గోపీచంద్

Seetimaarr Movie Will Entertain All Classes Of Audience Says Hero Gopichand,Seetimaarr Appeals To All Sections Says Gopichand,Seetimaarr Will Entertain All Classes Of Audience Says Gopichand,2021 Latest Telugu Movie,Latest 2021 Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Gopichand And Tamannaah Movie,Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Seetimaarr,Gopichand Seetimaarr Movie,Seetimaarr Movie,Seetimaarr,Seetimaarr Telugu Movie,Seetimaarr Movie Update,Seetimaarr Movie Latest Updates,Seetimaarr Latest Updates,Tamannaah,Tamannaah Movies,Tamannaah New Movie,Seetimaarr Official Trailer,Sampath Nandi,Mani Sharma,Bhumika Chawla,Sampath Nandi Movies,Seetimaarr Theatrical Trailer,Seetimaarr Release Date,Seetimaarr Teaser,Seetimaarr Trailer Telugu,Seetimaarr Trailer,Seetimaarr Movie Trailer,Gopichand Movie,Gopichand Upcoming Movie,Seetimaarr Telugu Movie Trailer,Gopichand About Seetimaarr Movie,Seetimaarr Movie Release Updates,Seetimaarr Telugu Full Movie,Seetimaarr Full Movie,Seetimaarr Movie Updates,Seetimaarr Update,Gopichand New Movie Update,Gopichand Latest Movie Update,Gopichand Upcoming Movies,Gopichand Latest News,Sampath Nandi Movies,Seetimaarr Movie Songs,Gopichand Latest Film Updates,#SeetimaarrOnSept10,#Seetimaarr

పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ వినాయకచవితి కానుకగా రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటించిన ఈ మూవీ లో దిగాంగన మరో కథానాయిక. పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో “సీటీ మార్ ” మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీటీ మార్ ” మూవీ రిలీజ్ సందర్భంగా హీరో గోపీచంద్ మీడియా తో సమావేశమయ్యారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ .. క్రీడా నేపథ్య కథాంశంతో తాను నటించిన తొలి సినిమా ఇదనీ , ఈ మూవీలో ఏపీ మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపిస్తాననీ , ఒక లక్ష్యం కోసం పోరాడే అతడికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి?తమ టీమ్‌ను ఎలా విజేతగా నిలిపాడన్నది ఆసక్తికరంగా ఉంటుందనీ , మహిళా క్రీడాకారిణులకు సమాజంలో ఎదురయ్యే వివక్షను అర్థవంతంగా సినిమాలో చూపించబోతున్నామనీ , మహిళా సాధికారతకు కమర్షియల్‌ హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు సంపత్ తెరకెక్కించారనీ , అంతర్లీనంగా వచ్చే సిస్టర్‌ సెంటిమెంట్‌ మనసుల్ని హత్తుకుంటుందనీ , ఈ సినిమాలో నిజమైన కబడ్డీ ప్లేయర్స్‌ నలుగురు నటించారనీ , ఓటీటీలో సినిమాల్ని విడుదల చేస్తున్న నిర్మాతల్ని తప్పు పట్టలేమనీ , వారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక వడ్డీలు పెరగడంతో పాటు అనేక కారణాలుంటాయనీ ,  నిర్మాతల సమస్యల్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనీ , ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్‌” మూవీ లో నటిస్తున్నాననీ , దర్శకుడు శ్రీవాస్‌తో మరో సినిమా ఉంటుందనీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =