
ట్యాగ్ · 106 కథనాలు · పేజీ 5


'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు

'రిపబ్లిక్' టీజర్ రిలీజ్

పుష్ప 'లోడ్ దింపతాండం'

"పుష్ప "మూవీ అప్ డేట్

రామ్‌తో 'జగడం' రీమేక్ చేయాలని ఉంది
అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా

'పుష్ప' సెట్ లో జానీ సందడి

దేవి శ్రీ ప్రసాద్ పాటకు సుక్కూ డ్యాన్స్
సుక్కూ కి బన్నీ మహేష్ బర్త్ డే విషెస్
జవాన్ పాత్రలో విజయ్ దేవరకొండ
న్యూ క్యారెక్టర్ లో నిఖిల్
నిఖిల్ '18 పేజెస్' షూటింగ్ మొదలు

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం
ప్రేక్షకాదరణ పొందిన "రంగస్థలం"
సుక్కూ - విజయ్ క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్
గుడ్ న్యూస్

"పుష్ప " మూవీ లో భారీ యాక్షన్ సీన్స్

18 పేజీస్.. నిఖిల్ సోలో పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా తన సినిమాల నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 నుండి స్పెషల్ పోస్టర్ ను.. అలాగే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న 18 పేజీస్ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా 18 పేజీస్ నుండి నిఖిల్ కు సంబంధించి సోలో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్
యువ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజీస్. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రను సృష్టించాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి రీసెంట్ గానే ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంది.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా గత ఏడాదే మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేక పోయింది. దానికి కారణం ఏంటో కూడా తెలుసు. అయితే ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఈలోపు ఇతర పనులను కానిచ్చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు.

'రిపబ్లిక్' టీజర్ రిలీజ్
మెగాహీరో సాయి తేజ్ ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సూపర్ ఫాంలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. 'రిపబ్లిక్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌కి మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సాయి తేజ్, రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ లను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అవికూడా బాగా ఆకట్టుకున్నాయి.

పుష్ప 'లోడ్ దింపతాండం'
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న సినిమా పుష్ప. పుష్ప రాజ్ అనే డ్రైవర్ పాత్రలో ఫుల్ మాస్ అండ్ రస్టిక్ లుక్ లో బన్నీ ఈసారి బాక్సాఫీస్ వద్ద దాడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ లుక్ ను చూసే సినిమాపై ఓరేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

"పుష్ప "మూవీ అప్ డేట్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. "పుష్ప "మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది.

రామ్‌తో 'జగడం' రీమేక్ చేయాలని ఉంది
కొన్ని సినిమాలు హిట్ కాకపోవచ్చేమో కానీ వాటికి మాత్రం స్పెషల్ గా గుర్తింపు ఉంటుంది. ఆ లిస్ట్ లో సుకుమార్ సినిమా జగడం కూడా ఉంటుంది. సుకుమార్ ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ తరువాత, రామ్ దేవదాస్ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వచ్చిన సినిమా జగడం. ఇద్దరికీ ఈసినిమా నిరాశనే మిగిల్చినా కూడా మంచి కల్ట్ మూవీ అని ఇప్పటికీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తారు. ఈ సినిమా నచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుకుమార్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలుచెప్పాడు. ఎంతో ప్రేమతో తాను జగడం సినిమా తీసినట్లు గుర్తు చేసుకున్నాడు.
అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా
మొత్తానికి సుకుమార్ అటు డైరెక్షన్ తో పాటు ఇటు నిర్మాణ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా యంగ్ స్టార్ట్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు. మొదట రాజ్ తరుణ్ తో కుమారి 21ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఇటీవల ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో యంగ్ హీరోతో సినిమాను లైన్ లో పెట్టాడు. అంతేకాదు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

'పుష్ప' సెట్ లో జానీ సందడి
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'పుష్ప' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరంలలో రెండు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న పుష్ప టీం ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ పాటకు సుక్కూ డ్యాన్స్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాపై పెరిగిన అంచనాల కారణంగా సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. ఇక సినిమాలో పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. ఇక ఉప్పెన సినిమాపై అంచనాలు పెరగడానికి టీజర్, ట్రైలర్ తో పాటు ఈ సినిమాలో పాటలు అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు మంచి హిట్టయ్యాయి. ఇక నీ కళ్లు నీలి సముద్రం పాట అయితే యూ ట్యూబ్ లో వ్యూస్ తో దూసుకుపోతుంది.
సుక్కూ కి బన్నీ మహేష్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ లో ఉన్న బ్రిలియంట్ డైరెక్టర్స్ లలో సుకుమార్ ఒకరని చెప్పొచ్చు. ఈ సినిమాల్లో లాజిక్స్, క్యాలిక్యులేషన్ తోపాటు కొత్తగా ఉంటాయి. ఇక ఈరోజు సుకుమార్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సుక్కూకి టాలీవుడ్ నుండి చాలా మంది సెలెబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్, మహేష్ బాబు సుకుమార్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
జవాన్ పాత్రలో విజయ్ దేవరకొండ
సూపర్ హిట్ "ఆర్య "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ "100%లవ్ ", "నాన్నకు ప్రేమతో ", "రంగస్థలం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ ని తెరకెక్కిస్తున్నారు. సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ తో విజయ్ దేవరకొండ హీరోగా గుర్తింపు పొంది "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా రాణిస్తున్నారు.
న్యూ క్యారెక్టర్ లో నిఖిల్
"హ్యాపీ డేస్ " మూవీ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ , "యువత "మూవీ లో విలేజ్ యువకుడు , "స్వామి రారా "మూవీ లో పిక్ పాకెటర్ , "కార్తికేయ "మూవీ లో మెడికల్ స్టూడెంట్ ; "ఎక్కడికి పోతావు చిన్నవాడా "మూవీ లో ప్రేమికుడు , "అర్జున్ సురవరం "మూవీ లో డేరింగ్ జర్నలిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ ", "కార్తికేయ 2 " మూవీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిఖిల్ '18 పేజెస్' షూటింగ్ మొదలు
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజెస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కరోనా వలన షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే మళ్లీ ఇన్ని నెలలు తర్వాత షూట్ ను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ తాజాగా లొకేషన్ లో పిక్ ను పోస్ట్ చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి21 F " మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ రూపొందుతుంది. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రేక్షకాదరణ పొందిన "రంగస్థలం"
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టార్ హీరోయిన్ సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆది పినిశెట్టి , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. "రంగస్థలం "మూవీ ప్రేక్షకాదరణ పొంది పలు అవార్డ్స్ అందుకుంది.
సుక్కూ - విజయ్ క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్
టాలీవుడ్ లో సూపర్ కాంబినేషన్స్ అన్నీ లైన్ కడుతున్నాయి. బన్నీ-కొరటాల, మహేష్-పరుశురాం ఇంకా చాలా ప్రెష్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. అయితే కరోనా వల్ల అసలే ఉన్న సినిమాలకు షూటింగ్ లు లేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ధైర్యం చేసి షూటింగ్స్ ను మొదలుపెట్టి షూటింగ్ వరకూ పూర్తి చేసుకుంటున్నారు కానీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు ఎవరికీ.
గుడ్ న్యూస్
తెలుగు , కన్నడ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రష్మిక షూటింగ్స్ ప్రారంభానికై ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ లో రష్మిక చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే పల్లెటూరి యువతిగా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ద్వారా అక్టోబర్ నెలలో షూటింగ్ లో పాల్గొనాలనే గుడ్ న్యూస్ రష్మిక కు అందింది.

"పుష్ప " మూవీ లో భారీ యాక్షన్ సీన్స్
బ్లాక్ బస్టర్ "రంగస్థలం" మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో "పుష్ప" మూవీ రూపొందుతుంది. రష్మిక కథానాయిక కాగా సునీల్ శెట్టి, బాబీ సింహా, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. "పుష్ప " మూవీ తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.