ప్రేక్షకాదరణ పొందిన “రంగస్థలం”

Rangasthalam Movie Turned Huge Hit After Recieving Positive Response From All Class Of Audience.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టార్ హీరోయిన్ సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రంగస్థలం “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆది పినిశెట్టి , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. “రంగస్థలం “మూవీ ప్రేక్షకాదరణ పొంది పలు అవార్డ్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు గా రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్టార్ హీరో యిన్ సమంత పల్లెటూరి యువతి రామలక్ష్మి గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక రంగమ్మత్త గా అనసూయ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. కథ హైలైట్ గా వాస్తవికతకు దగ్గరగా ఉన్న పాత్రలతో దర్శకుడు “రంగస్థలం “మూవీని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “రంగస్థలం “మూవీలో నటించిన ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చి చిత్ర విజయానికి తోడ్పడ్డారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.