కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Sukumar

ట్యాగ్ · 106 కథనాలు · పేజీ 6

సినిమా వార్తలు

తెలంగాణ సాయుధ పోరాటం పై సుకుమార్ మూవీ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సునీల్ శెట్టి, జగపతి బాబు, బాబు సింహా,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న "పుష్ప " మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోయిన్ల‌ విషయంలో సేమ్ స్ట్రాట‌జీ ఫాలో అవుతున్న సుకుమార్

వైవిధ్యభ‌రితమైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన ద‌ర్శ‌కుల్లో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఒక‌రు. మొదటి సినిమా ‘ఆర్య’ నుండి గత చిత్రం ‘రంగస్థలం’ వరకు నవ్యతకే పెద్దపీట వేశారాయన. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘పుష్ప’ కూడా అదే బాటలో వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. సుకుమార్ సినిమాలను గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే.. ఆయన చిత్రాల‌న్నీ 'సింగిల్ హీరోయిన్' సబ్జెక్టులే కావడం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"పుష్ప" మూవీ లో విలన్ గా బాలీవుడ్ హీరో ?

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా మూవీ "పుష్ప" రూపొందుతున్న విషయం తెలిసిందే. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "పుష్ప" మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Uppena Heroine Kriti Shetty To Work With Director Sukumar Again In Another Movie
సినిమా వార్తలు

సుకుమార్ తో మరో ఛాన్స్ కొట్టేసిన 'ఉప్పెన' హీరోయిన్..!

ఒక పక్క పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే... మరోపక్క చిన్న హీరోలకు కథలను అందిస్తూ తన నిర్మాణ సంస్థలోనే సినిమాలు తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉప్పెన సినిమా లైన్ లో ఉంది. సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ అమ్మడికి సుకుమార్ మరో సినిమాలో నటించే అవకాశం దక్కినట్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒక్క సినిమాకే సుకుమార్ సినిమాలో ఛాన్స్..!

ఇంకా తాను చేస్తున్న సినిమారిలీజ్ కూడా అవ్వలేదు అప్పుడే సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది పూరీ హీరోయిన్. పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమా ద్వారా కేతిక శర్మ పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మొదటి సినిమాలోనే ఈ భామ గ్లామర్ డోస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఇంకా సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.

TFN Adminవాట్సాప్
Director Sukumar Prepares Script For Chiru 153
సినిమా వార్తలు

#Chiru 153 మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సుకుమార్ ?

"సైరా నరసింహా రెడ్డి" మూవీ విజయం తరువాత మెగా స్టార్ చిరంజీవి తన 152 వ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, త్రిష జంటగా సోషల్ మెసేజ్ తో చిరంజీవి 152 మూవీ రూపొందుతుంది. 152 మూవీ తరువాత #Chiru 153 మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్