
ట్యాగ్ · 53 కథనాలు · పేజీ 2


హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ...!

రామ్ తో పవన్ డైరెక్టర్..!

'దువ్వాడ జగన్నాథం' హిందీ రీమేక్ ప్లాన్..!

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!

"భీమ్లా నాయక్"మూవీ పై హరీష్ శంకర్ స్పందన

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్
"తగ్గేదే లే"

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్

'సాయి తేజ్' ఫిట్ గా ఉన్నాడు..!

#PSPK28 రూమర్స్ పై క్లారిటీ

లెక్చరర్ గా పవన్ కళ్యాణ్

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా

ATM వెబ్ సిరీస్ హీరో పరిచయ గ్లింప్స్ రిలీజ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కుతున్న “ATM ” వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.దిల్ రాజు క్లాప్ కొట్టగా, హరీశ్ శంకర్ స్క్రిప్ట్ ను అందించారు. హైదరాబాద్ లోని స్లమ్స్ కు చెందిన నలుగురు యువకుల కథ నేపథ్యం తో తెరకెక్కుతున్న “ఏటీఎమ్” వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ అందించగా ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. సుబ్బరాజు - పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ...!
హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్.. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అయింది.. ఎప్పుడు స్టార్ చేశారు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. హరీష్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడు. అయితే అది సినిమా కాదు.. ఒక యాడ్ కోసం పనిచేస్తున్నారు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అల్లు అర్జున్. ఆ యాడ్ దర్శకత్వ భాద్యతలు హరీష్ శంకర్ తీసుకున్నారు. దీనికి వరల్డ్ క్లాస్ డీవోపీ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ జరుగుతుంది. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

రామ్ తో పవన్ డైరెక్టర్..!
తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో రామ్-కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరెక్కుతున్న సినిమా ది వారియర్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి సారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండటంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. జులై 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండటంతో దీనిలోభాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు.

'సర్కారు వారి పాట'పై హరీష్.. దిష్టి తీయించుకోండి..!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నిర్మించగా.. ఈసినిమా ఎన్నో ఎక్స్పేక్టేషన్స్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మొదటి నుండి ఎలాంటి అంచనాలు అయితే ఈసినిమాపై ఉన్నాయో ఆ అంచనాలను అందుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా మహేష్ బాబు స్టైల్ గానీ, యాక్షన్ సీక్వెన్స్, తన కామెడీ టైమింగ్ ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలువగా.. ముఖ్యంగా మహేష్-కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.

'దువ్వాడ జగన్నాథం' హిందీ రీమేక్ ప్లాన్..!
హరీష్ శంకర్ లాస్ట్ సినిమా గద్దల కొండ గడేష్. ఆ సినిమా తరువాత ఇంతవరకూ హరీష్ శంకర్ సినిమా మరొకటి రాలేదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా లైన్ లో ఉంది. అయితే ప్రస్తుతం పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది కూడా. ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

'పవన్' సినిమా పై 'హరీష్' ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎప్పుడో ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ సైట్స్ పైకి వెళ్లలేదు. కరోనా పాండమిక్ వల్ల, అలానే పవన్ కమిట్ అయిన సినిమాల వల్ల ఈసినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక హరీష్ కూడా గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ఇప్పటివరకూ మరో సినిమాను తీయలేదు. పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే పవన్ సినిమాకోసం ఎదురుచూడటంలో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెబుతున్నాడు హరీష్ శంకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

"భవదీయుడు భగత్ సింగ్" మూవీ లో ప్రొఫెసర్ గా పవన్ కళ్యాణ్?
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా "గబ్బర్ సింగ్ " మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలానే హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వీటిలో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు.

"భీమ్లా నాయక్"మూవీ పై హరీష్ శంకర్ స్పందన
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ తెరకెక్కనుంది. పూజాహెగ్డే కథానాయిక. అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయినా ఈ మూవీ పై ఏ ఒక్క అప్ డేట్ రాలేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
"తగ్గేదే లే"
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ "దువ్వాడ జగన్నాథమ్ "మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ హీరో అల్లు అర్జున్ ను కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రానుందా అని ప్రేక్షకులకు సందేహం వచ్చింది. "పుష్ప :ది రైజ్"మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అల్లు అర్జున్ "పుష్ప :ది రూల్"మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ "భవదీయుడు భగత్ సింగ్"మూవీ తెరకెక్కించే సన్నాహాలలో ఉన్నారు.

థియేటర్లు మాకు దేవాలయంతో సమానం..!
ఈమధ్య ఓటీటీలకు కూడా డిమాండ్ బాగానే పెరిగిందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల ద్వారా సినిమాలు కానీ వెబ్ సిరీస్ లను కానీ చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అందుకే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఈ జాబితాలో చేరారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్ రానుంది. హరీష్ శంకర్ కథను అందిస్తుండగా దిల్ రాజు ఈ సిరీస్ ను నిర్మించనున్నారు. సి. చంద్ర మోహన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం కూడా వహించనున్నారు.

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్
పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ "బ్లఫ్ మాస్టర్"మూవీ తో హీరోగా మరారు. సక్సెస్ ఫుల్ "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం", "గాడ్సే", "స్కైలాబ్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. "రామ్ సేతు" హిందీ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

'సాయి తేజ్' ఫిట్ గా ఉన్నాడు..!
మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, రెండు మూడు వారాలు హాస్పిటల్ లోనే ఉండటం, రీసెంట్ గా డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే కదా. దసరా పండుగ రోజు సాయి తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అందుకుగాను మెగా కాంపౌండ్ మొత్తం సాయ్ తేజ్ కు వెల్ కమ్ చెప్పారు. అంతేకాదు తేజ్ హెల్త్ అప్ డేట్స్ కూడా మెగా హీరోలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సాయి తేజ్ ను కలువగా తాాజాగా హరీష్ శంకర్ కూడా తేజ్ ను కలవడం జరిగింది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నా బ్రదర్ సాయ్ తేజ్ ను కలవడం జరిగింది.. తను చాలా ఫిట్ గా ఉన్నాడు.. ఈ విషయం పంచుకుంటున్నందుకు చాలా…

#PSPK28 రూమర్స్ పై క్లారిటీ
స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే సాధారణంగా ఆసినిమాలపై పలు వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇంకొక్క అడుగువేసి టైటిల్ ఇదై ఉండొచ్చు అని.. అలానే మేకర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా మ్యాన్ మేడ్ పోస్టర్స్ ను తయారు చేస్తుంటారు. ఆశ్చర్యం ఏంటంటే అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి కూడా పలు వార్తలు మొదలయ్యాయి. దీనితో మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

'పవన్' సంప్రదాయాన్ని పాటిస్తున్న 'బుట్ట బొమ్మ'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న స్పెషల్ హ్యాబిట్ గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రతి సమ్మర్ వచ్చినప్పుడల్లా ఆయన టాలీవుడ్ లో ఉన్న పలువురు సెలబ్రిటీలకు మామిడి పళ్లను పంపడం అలవాటు. ఈ సంప్రదాయాన్ని ఆయన ఎన్నో యేళ్ల నుండి పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పూజాహెగ్డే కూడా పాటిస్తుంది.

లెక్చరర్ గా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ "అయ్యప్పనుమ్ కోషియమ్ " మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!
2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుండి మరే సినిమా రాలేదు. అయితే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా మరో టాపిక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'
ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి' పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం వరకు దగ్గర దగ్గరగా వంద చిత్రాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక కొంత కాలం విరామం తరువాత ఆయన మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. కారణం ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ సినిమా మొదలుకానుంది.