హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ “దువ్వాడ జగన్నాథమ్ “మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ హీరో అల్లు అర్జున్ ను కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రానుందా అని ప్రేక్షకులకు సందేహం వచ్చింది. “పుష్ప :ది రైజ్”మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అల్లు అర్జున్ “పుష్ప :ది రూల్”మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ “భవదీయుడు భగత్ సింగ్”మూవీ తెరకెక్కించే సన్నాహాలలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసిన దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మన ఇద్దరం ఎప్పుడు కలిసినా నవ్వులే నవ్వులు. అల్లు అర్జున్… టైమ్ సరదాగా గడిచింది. మళ్ళీ కలిసే వరకూ… లవ్ యు. తగ్గేదే లే… ఎందుకు తగ్గాలి?” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: