ట్యాగ్ · 53 కథనాలు · పేజీ 3

పవన్ కి జోడీగా పూజా హెగ్డే..?
సాలిడ్ ఎంటర్ టైనర్ మూవీ
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?
కొరటాల, సుకుమార్ రూట్ లోకి హరీష్ శంకర్..!
వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!

మరో ఛాన్స్ కొట్టేసిన హరీష్..!
బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్
కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక నేడు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌లో అంత్య క్రియలు నిర్వహించారు.
#PSPK28 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
ఫైనల్లీ పవన్ నాలుగో అప్ డేట్ కూడా వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా సర్ ప్రయిజ్ ఉన్నట్టు నిన్ననే తెలిపారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో స్టైలిష్ బైక్ కనిపిస్తుండగా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం..బ్యాక్ డ్రాప్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ చిత్రాలు కనిపిస్తూ దేశభక్తిని స్మృశించేలా ఉంది. హరీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్…
సునీల్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా.. టైటిల్ ప్రకటన
టాలీవుడ్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కమెడియన్ కమ్ హీరో సునీల్. గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించాడు. అసలు సొంతం సినిమాలో సునీల్ కామెడీ ఆ సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ తరువాత వచ్చిన నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, ఎలా చెప్పను, ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ చేసిన మరిచిపోలేని.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు ఎన్నో ఉన్నాయి.

పవన్ కి జోడీగా పూజా హెగ్డే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్... ఈ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు హరీష్ శంకర్.
సాలిడ్ ఎంటర్ టైనర్ మూవీ
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "గబ్బర్ సింగ్ " రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శృతి హాసన్ కథానాయిక. "గబ్బర్ సింగ్ " మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటించిన "గబ్బర్ సింగ్ " మూవీ విశేష ప్రేక్షకాదరణ పొంది సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?
రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో అభిమానులు పవన్ సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్దిరోజుల్లో వకీల్ సాబ్ సినిమా రాబోతుంది అనుకుంటుండగా ఈలోపు కరోనా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉంది. ఇక ఆ పార్ట్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
మణిశర్మకు వెరైటీ గా విషెస్ చెప్పిన హరీష్ - ఇంద్ర అని గ్యాప్ ఇచ్చి మళ్లీ అంటాం..!
మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మణిశర్మ అని. ఇక ఈ రోజు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు విషెస్ చెపుతున్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ కూడా మణిశర్మ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. అయితే కాస్త వెరైటీ గా చెప్పాడు. ఈరోజుకీ.. ఇంద్ర.. అని గ్యాప్ ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నోటితో అనేసి మళ్లీ ఇంద్ర అంటాము. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్..’’ అని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కొరటాల, సుకుమార్ రూట్ లోకి హరీష్ శంకర్..!
సినీ ఇండస్ట్రీలో కాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ఈ మధ్య హీరోలు కూడా తమ సొంత కుంపటిని ఏర్పాటుచేసుకుని సొంతగా సినిమాలు తీసేసుకుంటున్నారు. మరి మేము మాత్రం సినిమాలే ఎందుకు డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్నారు. వాళ్ళ సినిమాలు వాళ్లే నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే మన డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల శివ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు రెడీ అయినట్టు గతంలోనే…
వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!
కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు.. రోజు కూలీలు చేసే వారికి సాయం చేస్తూనే వున్నారు. అంతేకాదు పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు చేశారు. సెలబ్రిటీస్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరికీ ఏదో ఒకవిధంగా సాయం అందుతూనే వుంది. కానీ వలస కార్మికుల పరిస్థితి మాత్రం వేరు. వారికి బాధ మాత్రం దయనీయం. లాక్ డౌన్ విధించిన వెంటనే చావైనా, బతుకైనా అనుకుని కాలిబాటన వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి…
పవన్ సినిమాపై హరీష్ - తమ్ముడూ స్క్రిప్ట్, మ్యూజిక్ పనులు జరుగుతున్నాయి
ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ అభిమాని తన ట్విట్టర్ ద్వారా ఎన్ని సినిమాలు అయినా చేయన్నా.. కానీ తదుపరి సినిమా పవర్ స్టార్ తో చేయి అంటూ ఓ అభిమాని చేసిన విన్నపానికి హరీశ్ స్పందించాడు. 'తమ్ముడూ... పవర్ స్టార్ మూవీ స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ కొనసాగుతున్నాయి. పవన్ కల్యాణ్ చిత్రం తర్వాతే మరే కమిట్ మెంట్ అయినా. నేను కూడా మీలాంటి అభిమానే అని మర్చిపోకు' అని సమాధానం ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

మరో ఛాన్స్ కొట్టేసిన హరీష్..!
గతకొద్ది నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియా లో హరీష్ శంకర్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. దానికి కారణం హరీష్, బండ్ల గణేష్ మధ్య వారే. ఇక ఇది పక్కనపెడితే ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఈ సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ఇప్పుడు మరో ఆఫర్ హరీష్ శంకర్ కు వచ్చినట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ మాస్ ఎంటర్ టైనర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `గబ్బర్ సింగ్` (2012) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్... అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ తరువాత ఈ ద్వయం మరోమారు జట్టుకట్టనున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఈ సంవత్సరం చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మళ్ళీ పోలీస్ స్టోరీతోనే.. పవన్, హరీష్ చిత్రం?
బ్లాక్ బస్టర్ మూవీ `గబ్బర్ సింగ్`(2012) తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది.