హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ…!

Allu Arjun and Harish Shankar Collaborate Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun latest Updates,Allu Arjun Upcoming Movies,Allu Arjun New Movies,Allu Arjun Telugu Movies, Allu Arjun and Harish Shankar Collaboration,Allu Arjun Pushpa 2 Movie,Allu Arjun Pushpa Latest Movie Updates,Allu Arjun and Shankar Join Hands For Upcoming Movies, Allu Arjun and Harish Shankar Team up for New Movie,Director Harish Shankar,Director Shankar and Allu Arjun Upcoming Movie,Allu Arjun Commercial Shoot for Astral Pipes, Pushpa: The Rule,Allu Arjun Pushpa: The Rule

హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్.. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అయింది.. ఎప్పుడు స్టార్ చేశారు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. హరీష్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడు. అయితే అది సినిమా కాదు.. ఒక యాడ్ కోసం పనిచేస్తున్నారు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అల్లు అర్జున్. ఆ యాడ్ దర్శకత్వ భాద్యతలు హరీష్ శంకర్ తీసుకున్నారు. దీనికి వరల్డ్ క్లాస్ డీవోపీ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ జరుగుతుంది. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి ఎంత సంచలన విజయం దక్కించుకుందో చూశాం. అల్లు అర్జున్ క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. దీంతో సుకుమార్ సెకండ్ పార్ట్ పై మరింత దృష్టి పెంచుతున్నాడు. ప్రస్తుతం ఈసినిమాకు సాలిడ్ కథను తయారుచేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక మరోవైపు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేస్తున్నాడు. పవన్ హీరోగా నటిస్తున్న ఈసినిమా పనిలో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఈసినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 19 =