పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నిర్మించగా..
ఈసినిమా ఎన్నో ఎక్స్పేక్టేషన్స్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మొదటి నుండి ఎలాంటి అంచనాలు అయితే ఈసినిమాపై ఉన్నాయో ఆ అంచనాలను అందుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా మహేష్ బాబు స్టైల్ గానీ, యాక్షన్ సీక్వెన్స్, తన కామెడీ టైమింగ్ ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలువగా.. ముఖ్యంగా మహేష్-కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సెలబ్రిటీల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. దీనిలో భాగంగానే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈసినిమాపై అలానే మహేష్ పై ప్రశంసలు కురిపించాడు. ఈసినిమా మొత్తం సూపర్ స్టార్ మహేష్ బాబుదే అని… మహేష్ స్వాగ్, టైమింగ్ చూడటానికి ట్రీట్ లా ఉంది. పరశురాం ఈ సినిమా కథను రాసుకున్న తీరు, ఈ సినిమాలోని కీలక పాత్రలను అద్భుతంగా చూపించిన తీరుకు అభినందనలు. మైత్రీ మూవీస్ వారు ఈ సారి దిష్టి తీయించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
It’s all about super star @urstrulyMahesh what a swag what a timing …. #SVP is a real treat to watch ,Kudos to @ParasuramPetla for his writing and presenting hilarious yet powerful characters … ee saari @MythriOfficial disti theeyunchukovaali !!!
— Harish Shankar .S (@harish2you) May 12, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: