
ట్యాగ్ · 38 కథనాలు


ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ వస్తోంది

ధనుష్ నీక్ తెలుగు టైటిల్ ఫిక్స్

ధనుష్, మారి సెల్వరాజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న సార్

కెప్టెన్ మిల్లర్ హై ఆక్టేన్ స్టంట్స్ తో ధనుష్

సార్ మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు

కాంటెంపరరీ నటుల్లో ధనుష్ టాప్

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ధనుష్ సార్ మూవీ

సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ సినిమా?

'సార్' టీజర్ రిలీజ్

ప్రారంభం అయిన "సార్ " మూవీ షూటింగ్

ధనుష్ 'సార్' మూవీ ప్రారంభం

ధనుష్ "సార్" మూవీ షూటింగ్ నేడే ప్రారంభం

వారి బయోపిక్ లో నటించాలని ఉంది..!

ఇడ్లీ కడై ఓటీటీ విడుదల తేదీ ఖరారు
కుబేర తరువాత తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ ఇడ్లీ కడై తో ప్రేక్షుకులముందుకు వచ్చాడు.అక్టోబర్ 1 న విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది.అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమా తెలుగులో శ్రీ ఇడ్లీ కొట్టు గా విడుదలైంది .శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేసింది.

ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ వస్తోంది
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇడ్లీ కొట్టు'. తమిళంలో 'ఇడ్లీ కడై' పేరుతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు శ్రీ వేదాక్షర మూవీస్ అందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియో మరియు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 1న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది.

ధనుష్ నీక్ తెలుగు టైటిల్ ఫిక్స్
తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. గత ఏడాది ఆయన డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ధనుష్ నటించాడు కూడా.ఇక ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో మరో సినిమా కూడా వస్తుంది అదే నీక్.ఇందులో పవిష్ ,వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,అనికా సురేంద్రన్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.ఈసినిమా నుండి వచ్చిన గోల్డెన్ స్పారో అనే సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.

రాయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలెంటెడ్ నటుడు ధనుష్ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు రాయన్ అంటూ వచ్చాడు. ఈసినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాకుండా తానే దర్శకత్వం కూడా వహించాడు. జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమా 100 కోట్లకు…

ధనుష్ శేఖర్ కమ్ముల మూవీ- ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
నేడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తన సినిమాల నుండి అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తను నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ సూపర రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా పీరియాడిక్ డ్రామాగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

ధనుష్, మారి సెల్వరాజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే కర్ణన్ సినిమా రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికం గా ప్రకటించారు.

సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న సార్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా చదువు జీవితాలు, ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుందనే నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో ధనుష్ మ్యాథ్స్ టీచర్ బాలుగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు సార్ సినిమాతో మరోసారి తన టాలెంట్ ను చూపించాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా సార్. తెలుగులో సార్ టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తమిళ్ లో వాతి టైటిల్ తో రిలీజ్ అయింది. ఈసినిమాలో విద్యా సంస్థల్లో జరిగే మోసాల గురించి.. కార్పొరేట్ విద్యా సంస్థల ఆదిపత్యం గురించి ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ధనుష్ సెటిల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

కెప్టెన్ మిల్లర్ హై ఆక్టేన్ స్టంట్స్ తో ధనుష్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా వరుసగా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు 16 గంటల పాటు నాన్ స్టాప్ గా దాదాపు 1500 మందితో ఈ…

సార్ మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ సార్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా చదువు జీవితాలు, ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుందనే నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి…

కాంటెంపరరీ నటుల్లో ధనుష్ టాప్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ధనుష్ సార్ మూవీ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, మాస్టారు మాస్టారు సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాస్టారు మాస్టారు సాంగ్ తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.

సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తన డబ్బింగ్ సినిమాలకే ధనుష్ ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తెలుగులో సినిమా చేస్తున్నాడు కాబట్టి ధనుష్ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను…

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ సినిమా?
తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కాకుండా…

'సార్' టీజర్ రిలీజ్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరింటిన ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో వస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ మంచి బజ్ క్రియేట్ అయింది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.

ప్రారంభం అయిన "సార్ " మూవీ షూటింగ్
తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కుతుంది. సంయుక్త మీనన్ కథానాయిక.సాయి కుమార్ తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ధనుష్ 'సార్' మూవీ ప్రారంభం
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. తెలుగులో సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా తమిళ్ లో వాతి అనే టైటిల్ తో వస్తుంది.

ధనుష్ "సార్" మూవీ షూటింగ్ నేడే ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్ , కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే.కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై ఫోకస్ పెడుతున్నారు. హీరోలు విజయ్ , ధనుష్ , కార్తికేయన్ తెలుగు మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వారి బయోపిక్ లో నటించాలని ఉంది..!
ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కి తమకు నచ్చిన పాత్రలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు.. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమ ఇంట్రెస్ట్ ను బయటపెడుతుంటారు. ఇక ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ఇద్దరు లెజెండరీల బయోపిక్ లలో నటించాలని ఉందని తెలిపాడు.